Salman-Chiru: అందరి వాడు సల్మాన్.. అందుకే చిరుకి స్వీట్ కండిషన్స్!

అలా చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని చిరూకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. మొహమాట పెడితే... స్మైల్ ఇచ్చి తగ్గే టైప్ తాను కాదని తేల్చేేశాడు. మరోసారి అలాంటి ఆఫర్ చేయొద్దని..

Salman-Chiru: అందరి వాడు సల్మాన్.. అందుకే చిరుకి స్వీట్ కండిషన్స్!

Salman Khan Condition To Chiranjeevi For Godfather Movie

Salman-Chiru: అలా చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని చిరూకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. మొహమాట పెడితే… స్మైల్ ఇచ్చి తగ్గే టైప్ తాను కాదని తేల్చేేశాడు. మరోసారి అలాంటి ఆఫర్ చేయొద్దని మెగాస్టార్ కి సల్లూబాయ్ కండీషన్ పెట్టారు. ఇంతకీ సల్మాన్ సీరియస్ అయింది ఎందుకు.. గాడ్ ఫాదర్ కాంబో మధ్య ఏం జరిగింది..?

Salman Khan: చిరుకు సల్మాన్ కండీషన్.. సెట్ నుండి వెళ్లిపోతానంటూ వార్నింగ్!

ముంబై నుంచి తిరిగొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ సల్మాన్ ఖాన్ తో గాడఫాదర్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేశారు. అయితే హైదరాబాద్ కి మాత్రం బరువైన గుండెతో తిరిగొచ్చారు. సల్మాన్ ట్రీట్ మెంట్ కి.. పెట్టిన స్వీట్ కండీషన్ కి మెగాస్టార్ ఫిదా అయ్యారు. అవును గాడ్ ఫాదర్ లో నటించినందుకు గానూ భారీగా ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ను నిర్మొహమాటంగా సల్లూభాయ్ వద్దనేశాడు.

Salman Khan : మరోసారి సల్మాన్‌కు కోర్టు నోటీసులు..

గాడ్‌ ఫాదర్‌ రెమ్యునరేషన్‌ విషయంలో సల్మాన్ నే నిర్మాతలు డెసిషన్ అడిగారు. ఎంత తీసుకున్నా పర్వాలేదన్నారు. అయితే భాయిజాన్ ఒక్క పైసా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మేకర్స్‌ చిరు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా సల్మాన్‌ ని అడిగితే.. అసలు తనకు ఎలాంటి రెమ్యునరేషన్ వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. అయినా చిరు పట్టుబట్టడంతో.. తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని సల్లూభాయ్ హెచ్చరించినట్టు చెప్తున్నారు.

Salman-Sonakshi: సల్మాన్‌తో సీక్రెట్ పెళ్లి.. సోనాక్షి రియాక్షన్ ఇదే!

ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కు ఫ్రెండ్లీ భాయ్ అన్న పేరుంది. తను నా అనుకున్న వాళ్లు ఎవరడిగినా సపోర్ట్ ఇస్తాడు. అందుకే చిరంజీవి కోసం కాల్షీట్స్ ఇచ్చాడు.. అటు రూపాయి తీసుకోకుండా షారుఖ్ ఖాన్ పఠాన్ కోసం స్పెషల్ రోల్ చేశాడు. ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో నటించాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ కోసం స్టెప్పులేశాడు. ఈమధ్యే అజయ్ దేవగన్ సినిమాను ప్రమోట్ చేశాడు. ఇలా ఎవరడిగినా కాదనకుండా అందరివాడు అనిపించుకుంటున్నాడు సల్మాన్ ఖాన్.