Salman Khan: చిరుకు సల్మాన్ కండీషన్.. సెట్ నుండి వెళ్లిపోతానంటూ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు రెడీగా.....

Salman Khan: చిరుకు సల్మాన్ కండీషన్.. సెట్ నుండి వెళ్లిపోతానంటూ వార్నింగ్!

Salman Khan Condition To Chiranjeevi For Godfather Movie

Salman Khan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు తన నెక్ట్స్ చిత్రాల షూటింగ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్.

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ముంబైలోని గాడ్‌ఫాదర్ మూవీ సెట్స్‌లో సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారియి. అయితే ఈ సినిమాలో సల్మాన్ నటించడానికి ఒప్పుకునే ముందు చిరంజీవికి ఓ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఫ్యామిలీతో తనకున్న సాన్నిహిత్యంతోనే గాడ్‌ఫాదర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని.. ఈ సినిమాలో తనది కేవలం కేమియో పాత్రే కావడంతో తాను ఎలాంటి రెమ్యునరేషన్ పుచ్చుకోబోనంటూ సల్మాన్ తేల్చి చెప్పాడట. అలా కాదని, తనకు బలవంతంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని చూస్తే షూటింగ్ సెట్స్ నుండి వెళ్లిపోతానంటూ చిరుకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడట ఈ బాలీవుడ్ కండల వీరుడు.

Salman Khan: ‘గాడ్‌ఫాదర్’ కోసం బరిలోకి దిగిన భాయిజాన్?

నిజానికి సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌కు ఆయన గెస్ట్ రోల్ చేసుకుంటే కూడా కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. కానీ మెగాస్టార్‌తో ఆయనకున్న మంచి రిలేషన్ కారణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గాడ్‌ఫాదర్ చిత్రంలో నటించేందుకు సల్మాన్ ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు. కేవలం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, మెగాస్టార్ అభిమానులు కూడా సల్మాన్ మంచితనానికి హ్యాట్సాఫ్ కొడుతున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.