Salman Khan: ‘గాడ్‌ఫాదర్’ కోసం బరిలోకి దిగిన భాయిజాన్?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

Salman Khan: ‘గాడ్‌ఫాదర్’ కోసం బరిలోకి దిగిన భాయిజాన్?

Salman Khan Joins Sets Of Chiranjeevi God Father

Salman Khan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న మెగాస్టార్, ఆ తరువాత వరుసబెట్టి యంగ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ఫాదర్’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనకు కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. గాడ్‌ఫాదర్ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ రెడీ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం గాడ్‌ఫాదర్ చిత్ర షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతుంది. అయితే సోమవారం ఈ షూటింగ్‌లో సల్మాన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేయనున్నాడు. దీంతో ఆయన పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే పనిలో చిత్ర యూనిట్ ఉందట. ఇక సల్మాన్ ఈ పాత్ర కోసం ఓ సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడట.

Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?

చిరు, సల్మాన్‌ల కాంబోను వెండితెరపై చూసేందుకు చిరంజీవి అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.