Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..

వాల్తేరు వీరయ్య సినిమాతో శృతిహాసన్ సూపర్ హిట్టు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి శృతి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఆడియన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది.

Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..

Shruti Haasan comments Chiranjeevi Waltair Veerayya gone viral

Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచమైన హీరోయిన్ శృతిహాసన్. యాక్టర్‌గా, సింగర్‌గా, డాన్సర్‌గా అలరిస్తూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. కెరీర్ మొదటిలో ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా ప్లాప్ అవుతూనే వచ్చింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి హిట్టుని అందుకొని తన పై ఉన్న ఐరన్ లెగ్ ముద్రని చెరిపేసుకుంది. ఆ తరువాత సౌత్ లోని స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకొని ముందుకు దూసుకు పోయింది. రీసెంట్ గా శృతిహాసన్ టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ హిట్టులు అందుకుంది.

Salaar: సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారిన సలార్.. డిజిటల్ రైట్స్‌కే డబుల్ మ్యాజిక్..?

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాలకృష్ణ – వీరసింహారెడ్డి, చిరంజీవి – వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది. కాగా వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్, చిరుతో కలిసి మంచులో రెండు పాటలకి డాన్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మంచులో డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హీరోలు చలిని ఆపే జాకెట్స్ వేసుకొని డాన్స్ చేస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం చీరలోనే డాన్స్ చేయాలి. ఇక నుంచి అయినా ఆ పద్ధతి మార్చండి. ఎందుకంటే రీసెంట్ గా దాని వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Salaar : RCB పై సలార్ మూవీ టీం ట్వీట్..

డైరెక్టర్ ని బ్రతిమాలినా వినకుండా చీరలోనే డాన్స్ చేయించినట్లు ఆమె బహిరంగంగా వాపోయింది. అయితే దీని పై టాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిస్ట్ లు అన్నాక సమస్యలు ఎదురుకొని నటించాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అలా చేయడం ఆర్టిస్ట్ గా తమ భాద్యత, అలాగే ఆ సమస్యలను తమలోని ఉంచుకోవాలి గాని ఇలా మాట్లాడడం సరి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.