ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్‌..

ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్‌..

Singer Mangli: ‘శైలజ రెడ్డి అల్లుడు చూడే’.. ‘రాములో.. రాములా’.. ‘భూం బద్దల్’.. ఈ పాటలు వినగానే బ్యూటిఫుల్ సింగర్ మంగ్లీ రూపం కళ్లముందు కదలాడుతుంది.. ఫోక్ సింగర్‌గా స్టార్ అయ్యి స్టార్ సింగర్‌గా ఎదిగిన ఆమె గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉంది.. ఆ నోటి నుండి వచ్చిన పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసిన మంగ్లీ టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాట, జాగో బంజారా సాంగ్‌తో పాటు ఎన్నో ఫెస్టివల్స్‌కి డివోషనల్ సాంగ్స్‌తో పాటు పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకున్నారు మంగ్లీ..

MANGLI

యాంకరింగ్ అయినా పాట అయినా తన స్టైల్ మ్యాడ్యులేషన్‌తో మెస్మరైజ్ చెయ్యడం మంగ్లీ స్పెషల్. ‘జార్జ్ రెడ్డి’ లో ‘‘వాడు నడిపే బండి రాయల్ ఇన్ ఫీల్డ్’’ పాట రిపీట్ మోడ్‌లో విన్నారు ఆడియెన్స్.. ‘అల.. వైకుంఠపురములో..’ మూవీలో ‘‘రాములో.. రాములా’’ సాంగ్ అయితే కిరాక్ అని చెప్పాలి.. చాలా మంది పార్టీ ప్లే లిస్టులో చేరిపోయింది ఈ పాట.. ఆదా శర్మ నటిస్తున్న ‘క్వశ్చన్ మార్క్’ మూవీలో ‘‘రామసక్కనోడివినోరా పిలగా’’ పాట మాస్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చిందంటే అది మంగ్లీ వాయిస్ వల్లే అని కొత్తగా చెప్పక్కర్లేదు.

MANGLI

నాగ చైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ లో ‘‘శైలజ రెడ్డి అల్లుడు చూడే’ పాట చాలా పాపులర్ అయింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ టాలీవుడ్‌కి పరిచయమవుతున్న చిత్రం ‘రాబర్ట్’.. ఇందులో మంగ్లీ పాడిన ‘‘కన్నె అదిరింది’’ పాట ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంగ్లీ స్టేజ్ మీద ఈ సాంగ్ పర్ఫామ్ చెయ్యగా యూనిట్ అండ్ ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘‘సారంగదరియా’’ అనే సాంగ్ రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది.

MANGLI

‘చావు కబురు చల్లగా’ లో స్టార్ యాంకర్ అనసూయ చేసిన ‘‘పైన పటారం.. లోన లొటారం’’ స్పెషల్ సాంగ్, ‘అల్లుడు అదుర్స్’ లో ‘‘రంభ ఊర్వశీ మేనక’’, ‘క్రాక్’ లో ‘‘భూం బద్దల్’’, ‘రాధకృష్ణ’ మూవీలో ‘‘నిర్మల్ బొమ్మ’’ వంటి సాంగ్స్‌ అంత బాగా హిట్ అయ్యాయంటే అది కేవలం మంగ్లీ మధురమైన గాత్రం వల్లనే అని కొత్తగా చెప్పక్కర్లేదు. తన పాటలతో పిల్లలనుండి పండు ముసలి వరకు అందర్నీ అలరిస్తూ, ఆకట్టుకుంటూ మన ఇంట్లో మనిషి అయిపోయింది మంగ్లీ..