Bigg Boss 5 : నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు.. వెళ్ళిపో.. సిరిపై సీరియస్ అయిన ష‌ణ్ను

ఈ ఐదో సీజన్ లో సిరి, ష‌ణ్ముఖ్ లు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళు బిగ్ బాస్ కి రావడానికి ముందు నుంచే ఫ్రెండ్స్ అవ్వడంతో చాలా క్లోజ్ గా ఉంటూ గేమ్ లో కూడా సపోర్ట్ చేసుకుంటున్నా

Bigg Boss 5 : నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు.. వెళ్ళిపో.. సిరిపై సీరియస్ అయిన ష‌ణ్ను

Siri Shannu

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో గొడవలు చాలా సర్వ సాధారణం. ఇక ఈ ఐదో సీజన్ లో అయితే కేవలం గొడవలే ఉన్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడు గొడవ పడదామా అన్నట్టు చూస్తారు. కానీ కొంతమంది మాత్రం ఎంత గొడవ పడినా తర్వాత కలిసిపోతారు. ఈ ఐదో సీజన్ లో సిరి, ష‌ణ్ముఖ్ లు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళు బిగ్ బాస్ కి రావడానికి ముందు నుంచే ఫ్రెండ్స్ అవ్వడంతో చాలా క్లోజ్ గా ఉంటూ గేమ్ లో కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు.

Bigg Boss 5 : యాని మాస్టర్‌కి సపోర్ట్‌గా మోనాల్.. ఆమె గురించి నాకు తెలుసు

నిన్నటి ఎపిసోడ్ లో ఎప్ప‌టిలాగే సిరి- ష‌ణ్ను మ‌రోసారి గొడ‌వ‌ప‌డ్డారు. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉంద‌ని, ఇక్క‌డి నుంచి వెళ్లిపో అని సిరి ష‌ణ్నుని అనడంతో ష‌ణ్ను సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఈ గొడ‌వ‌తో సిరి ఏడ్చేసింది. తర్వాత స‌న్నీ నామినేష‌న్స్‌ను ఇమిటేట్ చేస్తుంటే సిరి నవ్వింది. దీంతో ష‌ణ్ను.. దీన్నే డబుల్ ఫేస్ అంటారు, నా ద‌గ్గ‌ర ఇలా ఉండ‌కు, న‌న్ను మ‌ర్చిపో అని సీరియస్ గా చెప్పి దూరంగా వెళ్లి కూర్చొని ఏడ్చాడు. దీంతో సిరి అత‌డిని ఓదార్చేందుకు ప్ర‌య‌త్నించింది. నువ్వే అంటావు, మ‌ళ్లీ నువ్వే బాధ‌ప‌డాత‌వేంట‌ని అడిగింది.

Raghava Lawrence : రియల్ సినతల్లి ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

దీంతో ష‌ణ్ను.. నేను ఏడ్వ‌డం వ‌ల్ల నువ్వేం త‌క్కువైపోవు, నా క్యారెక్టరే త‌ప్పు, నువ్వు వెళ్లిపో అని సిరిని అన్నాడు. అయినా సిరి వెళ్లకుండా ష‌ణ్నుని గట్టిగా పట్టుకోవడంతో నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంట‌రిగా అనిపిస్తోంది, త‌నుంటే బాగుండేది అంటూ దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకుని ఏడ్చాడు. దీంతో సిరి ఏం కాదు ఇంకో నాలుగు వారాల్లో వెళ్ళిపోతాము అని చెప్తే నాకు తెలుసు ఎప్పుడు వెళ్లాలో అని సీరియస్ గా అన్నాడు ష‌ణ్ను.

Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్

నీ ఫ్రెండ్‌షిప్, నువ్వు ఏదీ నాకు వద్దు, నాకు నువ్వు అక్క‌ర్లేదు, వెళ్లిపో అన‌డంతో సిరి ఏడ్చుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి గ‌డియ పెట్టుకుంది. దీంతో కంగారు పడిపోయిన ష‌ణ్ను డోర్ తెయ్యి అంటూ డోర్ ని కొట్టాడు. అయినా డోర్ తీయకపోవడంతో కంటెస్టెంట్లు అందరూ కూడా భయపడుతూ బాత్రూం ద‌గ్గ‌ర‌కు వచ్చి సిరిని డోర్ తీయమని అడిగారు. ర‌వి డోర్ ని గట్టిగా కొడుతుంటే సిరి ఏడుస్తూ గ‌డియ తీసింది. వెంట‌నే ష‌ణ్ను ఆమెను ద‌గ్గ‌ర‌కు తీసుకుని హగ్ చేసుకొని ఓదార్చాడు.