AAGMC: కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే.. ఫీల్ సాంగ్ రిలీజ్!

సుధీర్ బాబు – విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబుకి జోడీగా ‘ఉప్పెన’తో బేబమ్మగా..

AAGMC: కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే.. ఫీల్ సాంగ్ రిలీజ్!

Aagmc

AAGMC: సుధీర్ బాబు – విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబుకి జోడీగా ‘ఉప్పెన’ తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ. ‘పుష్ప’ లాంటి సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమవడంతో ఈ సినిమాపై అటెన్షన్ మొదలైంది.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా నుండి ఓ బ్యూటీఫుల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అల్లంత దూరాన నువ్వు నీ కనులు నన్నే చూస్తుంటే ఏం చేయాలో అంటూ మొదలయ్యే ఈ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే అంటూ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ పుట్టే సమయంలో ఉండే భావాన్ని పాటగా మలిచారు. ఈ పాటలో కృతిశెట్టి మరింత అందంగా కనిపిస్తుంటే.. సుధీర్ సింపుల్ గా నెక్స్ట్ డోర్ యువకుడిగా కనిపిస్తున్నాడు.