Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

అప్పుడు.. ఇప్పుడు అంటున్నారు కానీ పుష్ప2 షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు. జూలై తర్వాతే పుష్పరాజ్ గా మారబోతున్నారు అల్లు అర్జున్. పుష్ప దక్కించుకున్న పవర్ఫుల్ రెస్పాన్స్..

Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

Pushpa

Pushpa 2: అప్పుడు.. ఇప్పుడు అంటున్నారు కానీ పుష్ప2 షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు. జూలై తర్వాతే పుష్పరాజ్ గా మారబోతున్నారు అల్లు అర్జున్. పుష్ప దక్కించుకున్న పవర్ఫుల్ రెస్పాన్స్.. సుకుమార్ పై ప్రెజర్ పెంచింది. అందుకే హడావిడీగా మొదలెట్టకుండా టైమ్ తీసుకుని మరీ పుష్ప2ను లాంచ్ చేయాలనుకుంటున్నారు.

Pushpa 2: టీమ్ వర్క్ మొదలు పెట్టిన పుష్పరాజ్.. అనుకున్నట్లే రిలీజ్!

జూలై తర్వాతే పుష్ప 2 సెట్స్ పైకెళ్లబోతుంది. సుకుమార్ మెడలో ఇప్పుడు పాన్ ఇండియా కత్తి వేలాడుతోంది. సో.. సుకుమార్.. పుష్ప2 మొదలెట్టాలంటే భారీ స్కేల్ లో ప్లాన్ చేయాలి. పాన్ ఇండియా ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకోవాలి. బన్నీ హీరోయిజం, సుకుమార్ మార్క్ డైరెక్షన్.. ఈ కాంబోకు పెరిగిన మార్కెట్ కారణంగా పుష్ప2ను ఎంతలా ఎలివేట్ చేయొచ్చో ఆలోచిస్తున్నారు మేకర్స్. దాని గురించే ప్రస్తుతం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు.

Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

అసలు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్, భారీ ఎత్తున ప్రమోషన్స్ లేకుండానే నార్త్ థియేటర్స్ లో రిలీజైంది పుష్ప. కానీ నెమ్మదిగా సీన్ మారిపోయింది. పుష్పరాజ్ ను బాలీవుడ్ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. లాంగ్ రన్ లో 100 కోట్లను తెచ్చిపెట్టారు. అల్లు అర్జున్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగింది. సైలెంట్ గా వచ్చి వయొలెంట్ హిట్ దక్కించుకున్న పాన్ ఇండియా స్టార్ అన్న ముద్ర ఐకాన్ స్టార్ పై పడింది. అందుకే ఇప్పుడు బన్నీకైనా, సుకుమార్ కైనా సౌత్ టు నార్త్ ఆడియెన్స్ మెప్పించేలా పుష్ప2ను తీసుకురావడమే అసలైన టార్గెట్.

Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

సౌత్ స్టోరీగానే పుష్ప వచ్చేసినా.. బాలీవుడ్ ఆడియెన్స్ కోసం పుష్ప2 మాత్రం చెక్కుతున్నారు సుకుమార్. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ కంటెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సౌత్ తో పాటూ నార్త్ జనాలు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటిని వడ్డించి తగ్గేదే లే అన్న రేంజ్ లో పుష్ప2 స్క్రిప్ట్ ను లాక్ చేయబోతున్నారు. అలాగే ఐటమ్ సాంగ్ కోసం దిశాపఠానిని, స్పెషల్ రోల్ కోసం సమంతాను, మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ను కూడా పుష్ప2 రంగంలో దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.