ఘనంగా సుమంత్ అశ్విన్ వివాహం

10TV Telugu News

Sumanth Ashwin – Deepika: ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్.ఎస్.రాజు తనయుడు, యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యారు.. దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం శనివారం జరిగింది.

Sumanth Ashwin

హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల వారు హాజరయ్యారు. బంధువులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు అటెండ్ అయ్యారు. ఇండస్ట్రీ నుండి కేవలం పదిమందిని మాత్రమే ఆహ్వానించారు. నటి తేజస్వి మడివాడ పెళ్లిలో పాల్గొని సందడి చేసింది.

Sumanth Ashwin

తండ్రి డైరెక్ట్ చేసిన ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌లతో కలిసి ‘ఇది మా కథ’ అనే మూవీ చేస్తున్నాడు.

Sumanth Ashwin