Bandi Sanjay : కొత్తపల్లిలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!
ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అంటూ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.

MP Bandi Sanjay (Photo Credit : @bandisanjay_bjp/ Google )
Bandi Sanjay : కొత్తపల్లి బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేం బరాబర్ రాముడి భక్తులమే.. నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు’’ అంటూ ఆరోపించారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ మండిపడ్డారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అంటూ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఒక్కో కార్పొరేటర్ బ్యాంకు అకౌంటులో రూ.5 లక్షల జమ చేశారన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నడని బండి సంజయ్ విమర్శించారు.
Read Also : Kcr : నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అదో పనికిమాలిన స్కీమ్, ఆడోళ్లు తన్నుకుంటున్నారు- కేసీఆర్