Hardik Pandya : హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంతో తెలుసా? ప్రపంచంలో 50 మంది దగ్గరే.. 10 ఆసియా కప్‌లు గెలిచినా అన్ని డబ్బులు రావుగా..
ఆసియాకప్ 2025 ముందు ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ధరించిన వాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Hardik Pandya ultra rare luxury watch grabs attention at Asia Cup training
Hardik Pandya : మంగళవారం నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. కానీ అంతకంటే ముందే టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)వార్తల్లో నిలిచాడు. అది క్రికెట్‌తో మాత్రం కాదు విలాసవంతమైన జీవన శైలితో. ప్రాక్టీస్ సెషన్‌లో అతడు ధరించిన వాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారాల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-04 ను ధరించాడు.
ఇండియన్ హోరోలజీ ప్రకారం.. దీని ధర అక్షరాలా రూ.20 కోట్లు అని అంచనా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టుకు కేవలం రూ.2.6 కోట్లు మాత్రమే ప్రైజ్‌మనీగా అందనుంది. అంటే ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన జట్టు కంటే కూడా హార్దిక్ ధరించిన వాచ్ ధర దాదాపు 10 రెట్లు ఎక్కువ అట.
రిచర్డ్ మిల్లే RM 27-04 వాచ్ ప్రత్యేకతలు ఇదే..
రిచర్డ్ మిల్లే RM 27-04 సాధారణమైన వాచ్ కాదు. దీనిని తొలుత స్టార్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదెల్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాచ్ ప్రధాన లక్షణం తేలికైన బరువు, అసాధారణమైన మన్నిక. ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఈ వాచ్ క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ వాచ్ 12000 G ఫోర్స్ కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు.
Back to business 🇮🇳 pic.twitter.com/Q1yEYAAoSw
— hardik pandya (@hardikpandya7) September 6, 2025
ఆసియాకప్‌లో 6 వికెట్లు తీస్తే..
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరుపున ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా 114 మ్యాచ్‌లు ఆడాడు. 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/16.
ఆసియాకప్ 2025లో పాండ్యా మరో 6 వికెట్లు సాధిస్తే టీ20 క్రికెట్ చరిత్రలో 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఏ భారత బౌలర్ కూడా టీ20లో 100 వికెట్లు సాధించలేదు. అర్షదీప్ సింగ్ 99 వికెట్లతో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.