Demon Slayer: ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్.. థియేటర్లో రష్మిక, టైగర్ హంగామా.. ఫ్యాన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్
యనిమే ఫ్యాన్స్ కోసం ముంబైలో ఘనంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్'(Demon Slayer) సినిమా స్క్రీనింగ్.

Demon Slayer movie special screening in Mumbai
Demon Slayer: ముంబైలో ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్’ సినిమా స్క్రీనింగ్ ఘనంగా జరిగింది. యనిమే ఫ్యాన్స్ కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ స్పెషన్ స్క్రీనింగ్ కి స్టార్ హీరోయిన్ రష్మిక, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హాజరయ్యారు. ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ లో హంగామా చేశారు. ఈ ఈవెంట్ కి రష్మిక టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా నిలిచే ప్రత్యేకమైన జపనీస్ డ్రస్సులో హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి ఆడియన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఇక మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్‌లో డీమన్ స్లేయర్(Demon Slayer) విడుదలకాబోతోంది. నిజానికి, ఓ యనిమే సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ చాలా కాలంలో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. యనిమే ఫ్యాన్స్ కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంయుక్తంగా ఈ క్రేజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాయు. సెప్టెంబరు 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.