Teja Sajja: చిరంజీవి సెలెక్ట్ చేసిన ఆ ఒక్క ఫోటో నా జీవితాన్నే మార్చేసింది: తేజ సజ్జ
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Hero Tej's interesting comments on Megastar Chiranjeevi
Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తుండగా రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఒక రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్.
ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో తేజ సజ్జ(Teja Sajja) తన సినీ జర్నీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిజానికి తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన చేసిన ఫస్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చూడాలని ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జ మెగాస్టార్ కొడుకుగా కనిపించాడు. అయితే, చూడాలని ఉంది సినిమా చిరు కొడుకు పాత్ర కోసం కొన్ని వందల ఫోటోలు వచ్చాయట. అందులో నుంచి తేజ సజ్జ ఫొటోను స్వయంగా చిరంజీవి సెలెక్ట్ చేసి నిర్మాత అశ్విని దత్ కి అందజేశారట.
అలా మెగాస్టార్ చిరంజీవి సెలెక్ట్ చేసిన ఫోటో వల్ల ఇప్పుడు ఈ స్థాయిలో మీ ముందు ఉన్నానని. లేదంటే నా జీవితం ఇంకోలా ఉండేదని చెప్పుకొచ్చారు హీరో తేజ సజ్జ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మిరాయ్ సినిమాపై విషయానికి వచ్చే.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి విడుదల తరువాత ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.