Rajinikanth-Kamal Haasan: రజినీ-కమల్ కాంబోలో మూవీ సెట్.. త్వరలోనే అనౌన్స్ మెంట్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
కొట్లాది మంది ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది.. (Rajinikanth-Kamal Haasan)ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ కాంబోలో మరో సినిమా రాబోతోంది.

Rajinikanth-Kamal Haasan: kamal haasan gives clarity on film with rajinikanth
Rajinikanth-Kamal Haasan: కొట్లాది మంది ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ విషయంపై ఏకంగా ఆ సినిమాలో నటించబోతున్న స్టార్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. ఇంతకీ ఆ కాంబోలో మరేదో కాదు తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్-కమల్ హాసన్(Rajinikanth-Kamal Haasan). అవును, ఈ ఇద్దరు స్టార్ హీరోలా కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని చాలా కాలంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే, ఇదే విషయంపై ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్ క్క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఆయన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. కల్కి సినిమాకి గాను ఆయన బెస్ట్ విలన్ గా అవార్డు అందుకున్నారు. ఆ సమయంలోనే యాంకర్ కమల్ ని.. రజినీతో సినిమా గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆయన మాటాడుతూ.. “ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడటం మంచిదే కదా. వారు సంతోషంగా ఉండటమే మాకూ ఆనందం. నిజానికి మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కుదర్లేదు. కానీ, త్వరలోనే మేము కలిసి మీ ముందుకు రానున్నాం. అది మిమ్మల్ని తప్పకుండా సర్‌ప్రైజ్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో ఈ బిగ్గెస్ట్ కాంబో సెట్ అయ్యింది, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు లోకేష్.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.