Terrorists Attack : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు

ఉగ్రదాడిపై సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. టెర్రరిస్టులను ఏరివేసేందుకు బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి.

Terrorists Attack : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు

Updated On : May 4, 2024 / 9:18 PM IST

Terrorists Attack : జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై( రెండు వాహనాలు) టెర్రరిస్టులు ఒక్కసారిగా ఫైర్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వాహనంతో పాటు మరో వాహనంపైనా దాడి చేశారు. గాయపడిన ఐదుగురు జవాన్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులను గర్తించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉగ్రదాడిపై సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. టెర్రరిస్టులను ఏరివేసేందుకు బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రదాడి జరిగిన ఘటనా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ ఘటనటో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గస్తీని ముమ్మరం చేశాయి.

Also Read : మీ జగన్.. భూములిచ్చేవాడు.. భూములు లాక్కొనేవాడు కాదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం