CM Jagan : మీ జగన్.. భూములిచ్చేవాడు.. భూములు లాక్కొనేవాడు కాదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం

భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

CM Jagan : మీ జగన్.. భూములిచ్చేవాడు.. భూములు లాక్కొనేవాడు కాదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం

CM Jagan

CM YS Jagan Election Campaign in Hindupur : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో పర్యటించారు. హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సెటర్ లో నిర్వహించిన సభలో జగన్ పాల్గొన్నారు. జగన్ రావడంతో అంబేద్కర్ సెంటర్ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మరో తొమ్మిది రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది. ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. పేదల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు పలుకుతాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమేనని జగన్ ప్రజలకు సూచించారు. జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 99శాతం అమలు చేశాం.. ఐదేళ్లలో 2.31లక్షల ఉద్యోగాలు కల్పించామని జగన్ చెప్పారు. 59 నెలల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐదేళ్ల మంచి పాలన తరువాత ఓట్లు అడుగుతున్నానని జగన్ అన్నారు.

Also Read : అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసంతకం దీనిపైనే చేస్తా: జగన్

చంద్రబాబు 14ఏళ్ల పాలనలో ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? వైసీపీ హయాంలో 2లక్షల 70వేల కోట్ల రూపాయలు ఖాతాల్లో వేశాంమని జగన్ చెప్పారు. బాబు పాలనలో ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? ఈ డబ్బులో చంద్రబాబు జేబుల్లోకి ఎంత పోయింది. ఇంటింటికి ఇచ్చే పెన్షన్లు కూడా చంద్రబాబు బంద్ చేయించాడని జగన్ విమర్శించారు. మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడు. మీ జగన్.. భూములిచ్చేవాడే కానీ.. భూములు లాక్కొనేవాడు కాదు. అసలు చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా అని జగన్ ప్రశ్నించారు. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని, భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని జగన్ అన్నారు.

Also Read : Hot Summer : నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. భీకర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు

ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి రావాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తికావాలి. ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తాం. వాటికి సంబంధించి సరిహద్దు రాళ్లను పెట్టిస్తాం.. రికార్డులన్నీ అప్ డేట్ చేయిస్తాం.. సబ్ డివిజన్ చేయిస్తాం.. భూమి హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతులకు అందేలా చేస్తామని జగన్ అన్నారు. 17వేలకు సంబంధించి రెవన్యూ గ్రామాలు ఉంటే.. ఇప్పటి వరకు 6వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యాయి. రాబోయే రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది. అప్పుడు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నింటికి వివాదాలు లేకుండా చేస్తాం. ఒకవేళ భూమి వివాదాలు వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని జగన్ అన్నారు. రిజిస్ట్రేషన్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 90లక్షల రిజస్ట్రేషన్లు జరిగాయని జగన్ చెప్పారు.