Fernandez Foundation : ఫెర్నాండెజ్ ఫౌండేషన్ వేదికగా ‘అంతర్జాతీయ మంత్రసాని’ దినోత్సవ వేడుకలు

అనుభవజ్ఞులైన మంత్రసానులు కాబోయే తల్లులకు మిడ్‌వైఫరీ సంరక్షణ సమాచారాన్ని వివరిస్తూ మార్గనిర్దేశం చేశారు. నార్మల్ డెలివరీకి అవసరమైన టూల్స్, అభ్యాసాలు తదితర విషయాలపై అవగాహాన కల్పించారు. 

Fernandez Foundation : ఫెర్నాండెజ్ ఫౌండేషన్ వేదికగా ‘అంతర్జాతీయ మంత్రసాని’ దినోత్సవ వేడుకలు

Fernandez Foundation Celebrates International Day of the Midwife Lifestyle

Fernandez Foundation : ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బంజారాహిల్స్‌లో ఫెర్నాండెజ్ స్టార్క్ హోమ్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ (బోగులకుంట)లో శనివారం (మే 4న) అంతర్జాతీయ మిడ్‌వైఫ్‌ (మంత్రసాని) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2017 నుంచి తెలుగు రాష్ట్రాలకు మంత్రసాని సేవలను అందించడంలో ఫెర్నాండెజ్ ఫౌండేషన్ అగ్రగామిగా నిలిచింది.

Read Also : Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

పోషణ, జీవన వృద్ధి (ట్రీ ఆఫ్‌ లైఫ్‌), అనుసంధానానికి ప్రతీకగా మిడ్‌వైఫ్‌ మంత్రసానుల తత్వానికి గౌరవప్రదంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అనుభవజ్ఞులైన మంత్రసానులు, ఫెర్నాండెజ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఫౌండేషన్‌ బృందం ప్రత్యేకంగా మిడ్‌వైఫరీ ఓపెన్ హౌస్‌ చికిత్స అందించారు.

వినూత్న పద్ధతులపై వివరణ :
మిడ్‌వైఫరీ ఆధ్వర్యంలో సహజ జననాల గురించి ప్రత్యేకమైన అవగాహాన కల్పించారు. అనుభవజ్ఞులైన మంత్రసానులు కాబోయే తల్లులకు మిడ్‌వైఫరీ సంరక్షణ సమాచారాన్ని వివరిస్తూ మార్గనిర్దేశం చేశారు. నార్మల్ డెలివరీకి అవసరమైన టూల్స్, అభ్యాసాలు తదితర విషయాలపై అవగాహాన కల్పించారు.

ఈ అవగాహాన కార్యక్రమంలో మంత్రసానులతో ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. గర్భిణీ తల్లుల శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన వ్యాయామాలను తెలియజేశారు. సురక్షితమైన జనన (డెలివరీ)కి అవసరమైన సేవలను సంస్థ అందించింది. సేవలు పొందే వారికి నార్మల్ డెలివరీ పద్ధతులపై నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రసవ నొప్పులు తగ్గేలా అరోమాథెరపీ, వాటర్ బర్త్ వంటి వినూత్న పద్ధతులను తెలియజేశారు.

ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్-మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. “ప్రతి గర్భిణీ డెలివరీ సమయంలో సంరక్షణలో భాగంగా మంత్రసాని అందించగలిగే ప్రపంచం కావాలని కలలు కన్నాను. తప్పనిసరి అయితే మాత్రమే ప్రసూతి వైద్యుడు సేవలు అందిస్తాం’ అని అన్నారు. ‘‘ప్రసూతి వైద్యులు, మంత్రసానులతో మెరుగైన ఫలితాలను అందించవచ్చు. మహిళలకు నార్మల్ డెలివరీ అయ్యేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం’’ ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి పేర్కొన్నారు.

మిడ్‌వైఫరీ సర్వీసెస్ డైరెక్టర్ ఇందర్‌జీత్ కౌర్ మాట్లాడుతూ.. “ప్రసవించేటప్పుడు, ప్రసవం తర్వాత మహిళలకు మానసిక, శారీరక, వైద్యపరమైన సాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలకు సాధికారతతో పాటు విజ్ఞానం అందించి వారిలో విశ్వాసాన్ని కల్పిస్తామని మంత్రసానులు అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రసవంకు సంబంధించిన అవగాహన కల్పించేందుకు ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. ఆరోగ్యకరమైన జననాలను ప్రోత్సహించడంలో మంత్రసాని ప్రాధాన్యతను వివరించారు. ఎడ్యుకేషనల్ వర్క్‌షాప్‌, ప్రసవ వ్యాయామాలు, జాగ్రత్తలు, నియమాలపై కూడా దృష్టిసారించినట్టు తెలిపారు.

Read Also : Amazon Great Summer Sale 2024 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. రూ. 50వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్..!