Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!

నాటు స్టెప్పులేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. నార్త్ లో తన డాన్సింగ్ స్కిల్స్ చూపించాలని బన్నీ ఉవ్విళ్లూరుతున్నారు. ఇటు చిరూ, సల్మాన్ కూడా కలిసి కాలు కదిపేందుకు సై..

Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!

Telugu Heroes

Telugu Heroes: నాటు స్టెప్పులేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. నార్త్ లో తన డాన్సింగ్ స్కిల్స్ చూపించాలని బన్నీ ఉవ్విళ్లూరుతున్నారు. ఇటు చిరూ, సల్మాన్ కూడా కలిసి కాలు కదిపేందుకు సై అంటున్నారు. గాడ్ ఫాదర్ కోసం ఊర మాస్ స్టెప్పులేయబోతున్నారు. వీళ్లందరికీ లేటెస్ట్ ఇన్సిపిరేషన్ ట్రిపుల్ ఆర్ నాటు నాటే. అందుకే అంతే నాటుగా తమ సినిమాల్లోనూ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు.

Telugu Star Heroes: బాలీవుడ్‌కు తారక్-బన్నీ.. హాలీవుడ్‌కు ప్రభాస్!

బాలీవుడ్ ఆడియెన్స్ కు ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకొచ్చింది తారక్, చరణ్ మాస్ స్టెప్పులేసిన నాచో నాచ్ సాంగ్. ఈ పాట.. పాటలో స్టెప్పులు చేసిన మ్యాజిక్ కూడా నార్త్ లో ట్రిపుల్ ఆర్ మోత మోగడానికి ఓ రీజన్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన డాన్స్ ప్రేక్షకులని ఫిదా చేసింది. అందుకే ఆ రేంజ్ లో డాన్సింగ్ స్కిల్స్ నార్త్ లో చూపించేందుకు తహ తహలాడుతున్నారు బన్నీ. అసలే డాన్సింగ్ డైనమైట్ అల్లు అర్జున్. పుష్ప 2 కోసం మాసివ్ స్టెప్పులెస్తే ఆడియెన్స్ ఆపడం కష్టమే.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

నిజానికి స్క్పిప్ట్, క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప కోసం తన టోటల్ డాన్సింగ్ స్కిల్స్ చూపించే ఛాన్స్ దక్కలేదు బన్నీకి. ఉన్నంతలో తగ్గదే లే సిగ్నేచర్ మూమెంట్, శ్రీవల్లీ లెగ్ స్టెప్, ఏయ్ బిడ్డా డాన్స్.. పాన్ ఇండియా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అయితే పుష్ప2 కోసం ఎదురుచూస్తోన్న బాలీవుడ్ జనాల కోసం ఈసారి తనలోని అసలైన డాన్సర్ ని చూపించబోతున్నారు అల్లు అర్జున్. ఆ మేరకు కలిసొచ్చేలా సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ తో పాటూ మాస్ ఐటమ్ ను లాక్ చేస్తున్నారు.

Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

ట్రిపుల్ ఆర్ ఇన్స్ పిరేషన్ తో సీనియర్ స్టార్స్ చిరూ, సల్మాన్ కలిసి చిందులేసేందుకు సిద్ధమవుతున్నారు. గాడ్ ఫాదర్ లో ఇప్పటికే తన పార్ట్ షూట్ ను కంప్లీట్ చేసిన సల్మాన్.. త్వరలో తమన్ కంపోజ్ చేసిన క్యాచీ ట్యూన్ కి మెగాస్టార్ తో కలిసి డాన్స్ చేయబోతున్నాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట త్వరలోనే ముంబైలో షూటింగ్ జరుపుకోనుందని టాక్. చిరు, సల్మాన్ స్టెప్పులు.. నాచో నాచ్ రేంజ్ లో అభిమానుల్ని ఉర్రూతలూపుతాయని ఇప్పటినుంచే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.