Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టడానికి కష్టపడుతున్నారు కుర్రహీరోలు. రొటీన్ సినిమాలు చేస్తూ.. బోర్ కొట్టిస్తున్న చిన్న హీరోలు.. కొత్త కంటెంట్ తో వస్తున్నారు.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

Telugu Young Heroes

Telugu Young Heroes: కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టడానికి కష్టపడుతున్నారు కుర్రహీరోలు. రొటీన్ సినిమాలు చేస్తూ.. బోర్ కొట్టిస్తున్న చిన్న హీరోలు.. కొత్త కంటెంట్ తో వస్తున్నారు. కాన్సెప్ట్ తో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంట్రస్టేకాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Telugu Senior Heroes: కుర్ర భామలతో రొమాన్స్.. ఏజ్ బార్ హీరోల కష్టాలు

ఇంతమంది స్టార్ హీరోల మధ్య.. చిన్న హీరోల సినిమాల్ని ఎవరు చూస్తారు..? రిలీజ్ చేసినా ఏదో ఒకటి రెండు రోజులు తప్ప గట్టిగా వారం రోజులు ధియేటర్లో ఉండే పరిస్తితి లేదు. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన డీజే టిల్లు చిన్న సినిమాల్లో స్పెషల్లీ కంటెంట్ ఉన్న సినిమాలు గ్యారంటీగా సక్సెస్ అవుతాయన్న హోప్ ఇచ్చింది.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

రవితేజ భారీ బడ్జెట్ తో తెరెకెక్కించిన ఖిలాడి సినిమాతో పోటీ పడి రిలీజ్ అయిన డిజె టిల్లు.. ఖిలాడిని పక్కకి నెట్టి హౌస్ ఫుల్ అయ్యింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ యాడ్ అవ్వడంతో అన్ని రకాల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి బంపర్ హిట్ అయ్యింది. 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి యాక్షన్, మాస్ సినిమాలతో యూత్, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మాస్ కా దాస్.. ఇప్పు కంటెంట్ రూట్ లోకి వచ్చాడు. ఇప్పటి వరకూ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసిన విష్వక్.. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం అనే ఇంట్రస్టింగ్ సినిమాలో క్యారెక్టర్ తో పాటు కంప్లీట్ లుక్ కూడా చేంజ్ చేసిన విష్వక్.. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

ఉప్పెన, కొండపొలం సినిమాలతో ఎమోషనల్ కంటెంట్ ని చూపించిన వైష్ణవ్ తేజ్.. ఈసారి కొత్త కంటెంట్ తో ఇంట్రస్టింగ్ గా రాబోతున్నాడు. ఇప్పటి వరకూ సినిమాల్లో కనిపించిన లుక్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ గా స్టైలిష్ గా లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు రంగరంగ వైభవంగా సినిమాలో. కేతికశర్మ జంటగా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వైష్ణవ్ ఇమేజ్ ని గ్యారంటీగా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుందంటున్నారు టీజర్ చూసిన ఫాన్స్.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న మరో యంగ్ డైరెక్టర్ కిరణ్ అబ్బవరం కూడా ఈ సారి కొత్త కంటెంట్ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకూ లవ్ స్టోరీ లు చేసిన కిరణ్ రేచీకటి ఉన్న పోలీస్ గా కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాడు. సెబాస్టియన్ పిసి 524 అనే టైటిల్ తో ఇంట్రస్టింగ్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం లుక్ వైజ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

హిట్, ఫ్లాప్ తో సంబందం లేకుండా నచ్చిన సబ్జెక్ట్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్లే శ్రీవిష్ను కూడా ఈసారి డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గాలి సంపత్, రాజరాజచోర, అర్జున-ఫల్గుణ అంటూ డిఫరెంట్ జానర్స్ చేసిన శ్రీవిష్ను.. ఈ సారి సొసైటీ లో ఉన్న ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని కొత్త కంటెంట్ తో భళాతందనాన సినిమా చేస్తున్నారు.

2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

కెరీర్ స్టార్టింగ్ నుంచి బిగ్గెస్ట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ.. రకరకాల సినిమాలు చేసి అన్ని జానర్స్ ను టచ్ చేసిన ఆది.. ఈ సారి అంతకుమించిన ఇంట్రస్టింగ్ స్టోరీతో కథతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ గా సిఎస్ ఐ సనాతన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ కాన్సెప్ట్ మూవీలో సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు ఆదిసాయికుమార్.