2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

తెలుగు సినిమా స్థాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించే మాట్లాడుకోవాలి. టాలీవుడ్ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసి వేలకోట్ల బిజినెస్ దిశగా అడుగులేస్తోంది.

2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

2022 Telugu Films

2022 Telugu Films: తెలుగు సినిమా స్థాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించే మాట్లాడుకోవాలి. టాలీవుడ్ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసి వేలకోట్ల బిజినెస్ దిశగా అడుగులేస్తోంది. పాన్ ఇండియా పేరుతో మొదలైన ఈ ట్రెండ్ తెలుగు సినిమాను ఇండియన్ సినిమాగా మార్చేస్తే.. ఒక్కో సినిమా కోట్ల నుండి వందల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తుంది. 2021 కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన తెలుగు సినిమా వచ్చే 2022 ఏడాదికి వేల కోట్ల బిజినెస్ ను టార్గెట్ చేస్తుంది. దానికి 2022 ఏడాది ఆరంభం నుండే ప్లాన్ మొదలెట్టింది.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

వచ్చే ఏడాది సంక్రాంతి ముందే ప్రేక్షకులకి పండగ తెచ్చేందుకు సిద్దమైన తెలుగు సినీ పరిశ్రమ.. తొలి ఒకటిన్నర నెలలోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయలకి పైగా టార్గెట్ చేసింది. అది కూడా.. సోలో హీరోలు కాదు.. మల్టీస్టారర్ మ్యానియాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తికాగా సినిమాలు ఎప్పుడా అనేలా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఆ హీరోల అభిమానులు. ఇందులో ముందుగా వచ్చేది.. తెలుగు సినిమా వైపు ప్రపంచ చూపు తిప్పేది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇన్ ఇండియా ఆర్ఆర్ఆర్.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

అందరి కంటే ముందుగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇందులో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, శ్రేయ సరన్.. బాలీవుడ్ నుండి అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ నుండి ఒలీవియా మోరిస్ ఇలా భారీ తారాగణం కనిపించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా బిజినెస్ దాదాపు 500 కోట్లు కాగా.. ఇది ఎంత వసూళ్లు రాబడుతుందనేది ట్రేడ్ పండితులు కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇక ఆ తర్వాత జనవరి 12న పవన్ కళ్యాణ్-రానాల భీమ్లా నాయక్ రానుండగా ఇప్పటికే రూ.140 కోట్లకు బిజినెస్ జరిగింది.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

ఆ తర్వాత జనవరి 15న రానున్న నాగార్జున, నాగచైతన్యల బంగార్రాజు సినిమా ఇప్పటికే రూ.40 కోట్ల బిజినెస్ పూర్తిచేసుకోగా.. ఫిబ్రవరి 4న రానున్న చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య సినిమా దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. చివరిగా ఫిబ్రవరి 25న రానున్న వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3.. 80 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా. ఇలా జస్ట్ 50 రోజుల్లోనే తెలుగు సినిమా వెయ్యి కోట్ల బిజినెస్ తో మొదలవనుండగా.. ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడతాయి.. అసలు ఈ ఏడాది మన సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని ఊహించడం కూడా కష్టమే అవుతుంది.

Sankranti 2022: మనసు మార్చుకుంటున్న సంక్రాంతి పందెం కోళ్లు!

ఈ నాలుగు సినిమాలే కాదు.. మహేష్ సర్కారు వారి పాటకి తోడు ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్న సినిమాలతో ఇది వేల కోట్ల సినిమా మార్కెట్ గా మారనుందా అనిపిస్తుంది. వచ్చే ఏడాది తొలి సినిమాల ఓపెనింగ్ ని బట్టి ఈ ట్రేడ్.. ఏ ట్రెండ్ లో కొనసాగుతుందో చూడాలి ఉండగా.. ఏది ఏమైనా టాలీవుడ్ పేరు దేశవ్యాప్తంగా మార్మ్రోగడం ఖాయంగా కనిపిస్తుంది.