Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలంటే.. ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు అయ్యి ఉండాలనే టైమ్ ఎప్పుడో దాటిపోయింది. మంచి కథ ఉంటే చాలు.. స్టార్ హీరోల్ని పడెయ్యడం..

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

Telugu Young Directors

Telugu Young Directors: స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలంటే.. ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు అయ్యి ఉండాలనే టైమ్ ఎప్పుడో దాటిపోయింది. మంచి కథ ఉంటే చాలు.. స్టార్ హీరోల్ని పడెయ్యడం, వాళ్లతో సినిమా ఛాన్సులు కొట్టేయడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. ఒకప్పుడు స్టార్ హీరోలు సీనియర్ హీరోలతో తప్ప ఎవ్వరితోనూ పెద్దగా సినిమాలు చేసే వాళ్లు కాదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మారిపోయింది. ట్రెండ్ ని ఫాలో అయ్యే కొత్త డైరెక్టర్లతో పాటు, ఆడియన్స్ పల్స్ పట్టుకునే యంగ్ డైరెక్టర్ల తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు స్టార్ హీరోలు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

లేటెస్ట్ గా రామ్ చరణ్.. జెర్సీ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరితో సినిమా అనౌన్స్ చేశాడు. మళ్లీ రావా, జెర్సీ సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కి బంపర్ ఛాన్సిచ్చాడు చరణ్. చేసింది 2 సినిమాలే అయినా.. వాటితోనే మంచి క్రేజ్ సంపాదించి సక్సెస్ అందుకున్నాడు కాబట్టి గౌతమ్ తో తన సినిమా సక్సెస్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చరణ్.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన 25 మూవీని యంగ్ డైరెక్టర్ తోనే చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డితో అదిరిపోయే హిట్ అందుకుని అటు నుంచి బాలీవుడ్ ఛాన్సులు దక్కించుకున్న సందీప్ రెడ్డితో తన సిల్వర్ జూబ్లీ సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ స్టార్ డమ్ ని క్యారీ చెయ్యడం సందీప్ కి కత్తిమీద సామే. అయినా.. హీరో ఎవరైనా కథనుమాత్రం డ్రైవ్ చేసే సందీప్ పనితనానికి ఫిదా అయిన ప్రభాస్.. సందీప్ తో స్పిరిట్ సినిమా చెయ్యబోతున్నాడు.

Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్రకి ఛాన్సిచ్చాడు. రెండే రెండు సినిమాలు చేసిన సాగర్.. పెద్ద సక్సెస్ ని అందుకోలేకపోయినా.. భీమ్లానాయక్ సినిమాని ఈ యంగ్ డైరెక్టర్ కి అప్పగించాడు పవన్ కళ్యాణ్. సినిమాలు హిట్ అవ్వకపోయినా.. కన్విన్సింగ్ గా కథను డీల్ చెయ్యడంలో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, రానాని డైరెక్ట్ చేస్తున్నాడు.

Films : ఒకే ఒక్క బ్రేక్ కావాలి…హిట్ కావాలి

అల్లు అర్జున్ కూడా అప్పట్లోనే శ్రీరామ్ వేణుకి ఛాన్సిచ్చి సినిమాని హోల్డ్ లో ఉంచాడు. పెద్దగా హిట్లు తియ్యకపోయినా.. ఐకాన్ మూవీ ఛాన్సిచ్చాడు బన్నీ. ఈ గ్యాప్ లో వేణు.. వకీల్ సాబ్ తీసి మంచి హిట్ అందుకున్నాడు. దాంతో మళ్లీ ఐకాన్ ని లైన్లోకితెచ్చాడు బన్నీ. మాస్ మహారాజా రవితేజకూడా ఒకే సినిమా చేసిన శరత్ మండవతో రామారావు ఆన్ డ్యూటీ అంటూ పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడు.

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని కొత్త డైరెక్టర్ని తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో దసరా టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమా నానికెరీర్ లోనే కంప్లీట్ కాంట్రాస్ట్ గా లుక్ వైజ్, అప్పియరెన్స్ వైజ్, లాంగ్వేజ్ వైజ్ సరికొత్తగా తెరకెక్కబోతోంది. ఇలా యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు స్టార్ హీరోలను ఫిదా చేసి తెలుగు సినిమాకు కొత్త లుక్ తీసుకొస్తున్నారు.