Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

సినిమా ఇండస్ట్రీలో సస్టెయిన్ అవ్వాలంటే సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ కోసం రకరకాలుగా ట్రై చేస్తుంటారు హీరోలు. ఒక్క హిట్ పడిందని సంతోషపడేలోపే మరో ఫ్లాప్ పలకరిస్తుంది. ఇలా పడుతూ లేస్తూ..

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

Young Heroes

Young Heroes: సినిమా ఇండస్ట్రీలో సస్టెయిన్ అవ్వాలంటే సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ కోసం రకరకాలుగా ట్రై చేస్తుంటారు హీరోలు. ఒక్క హిట్ పడిందని సంతోషపడేలోపే మరో ఫ్లాప్ పలకరిస్తుంది. ఇలా పడుతూ లేస్తూ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలపై ఓ లుక్కేద్దాం.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

సినిమా హిట్ అనేది హీరోలందరికీ ఇంపార్టెంటే. కానీ స్టార్ హీరోలకు ఒక ఫ్లాపొచ్చినా పెద్దగా వాళ్ల కెరీర్ గ్రాఫ్ కి ఇమేజ్ కి వచ్చిన నష్టమేం లేదు.. కానీ మిడిల్ రేంజ్ హీరోల పరిస్తితి అలా కాదు.. ఒక్క సినిమా రిజల్ట్ తో ఈ మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. లేటెస్ట్ గా శర్వానంద్ ఇదే ట్రయల్స్ లో ఉన్నాడు. ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ మనసు గెలుచుకోవడానికి రెడీ అవుతున్నాడు.

Deepika Pilli: చిట్టి నడుము సొగసులతో దీపికా లొల్లి!

మహానుభావుడు సక్సెస్ తర్వాత 5 ఏళ్ల నుంచి శర్వాకి సక్సెస్ పడలేదు. పడిపడి లేచే మనసు పర్వాలేదని పించినా, 2019లో వచ్చన రణరంగం సక్సెస్ ఇవ్వలేకపోయింది. 2020లో వచ్చిన జాను మూవీ ఓకే అనిపించినా.. శ్రీకారం మూవీ కూడా కమర్షియల్ హిట్ అవ్వలేదు. ఇక 2021లో వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయ్యింది. అందుకే ఈ సంవత్సరం ఆడవాళ్లూ మీకో జోహార్లు సినిమాతో పాటు ఒకే ఒకజీవితం అనే ఎమోషనల్ మూవీ చేస్తూ.. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

నాని.. మిడిల్ రేంజ్ హీరో అయినా… బాయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ నాని కూడా సక్సెస్, ఫ్లాప్ మధ్య ఊగుతూనే ఉన్నాడు. 2019లో జెర్సీతో సూపర్ సక్సెస్ అందుకున్న నాని.. గ్యాంగ్ లీడర్ తో పర్వాలేదనిపించారు. ఆ తర్వాత వచ్చిన వి, టక్ జగదీష్ మళ్లీ నానీకి సక్సెస్ లోటు తెచ్చిపెట్టాయి. అయితే శ్యామ్ సింగరాయ్ మాత్రం నాని కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాని ఫినిష్ చేసి దసరా అనే కొత్త సినిమాని స్టార్ట్ చేసి సాలిడ్ సక్సెస్ కొట్టి తన ప్లేస్ ని పదిలం చేసుకుందామనుకుంటున్నారు.

NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

అప్పుడెప్పుడో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ కూడా ఇంకా నిలదొక్కు కోలేకపోయారు. ఒక హిట్, 2 ఫ్లాపులతో కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం భీష్మతో మంచిహిట్ అందుకున్న నితిన్.. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చెక్ ఫ్లాఫ్ అయ్యింది. రంగ్ దే సినిమా పర్వాలేదనిపించినా.. మ్యాస్ట్రో ఓటీటీలో మంచి టాకే తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

లవర్ బాయ్ రామ్ కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచి కాన్ స్టంట్ కెరీర్ గ్రాఫ్ నికంటిన్యూ చెయ్యలేకపోయాడు. రొటీన్ స్టోరీస్ తో బోర్ కొట్టించన రామ్.. వరసగా ఫ్లాపుల తర్వాత 2019లో ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రెడ్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ కాప్ సబ్జెక్ట్ తో వారియర్ గా హిట్ గోల్ సెట్ చేసుకుంటున్నాడు. ఇలా పడుతూ లేస్తూ.. హీరోలు సక్సెస్ గ్రాఫ్ మెయింటెన్ చెయ్యడానికి తెగ కష్టపడుతున్నారు.