Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

కొత్తగా రాబోయే సినిమాలోనే కాదు.. ఇంతకు ముందే వచ్చిన సినిమాలో కూడా ఎక్కడ చూసినా లవ్ ట్రాక్స్ కనిపించేది. ప్రేమ పాటలే వినిపించేది. ఇక లేటెస్ట్ గా ఒక్క పాటతో ఇండియానే కాదు..

Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

Heroes Love Songs

Heroes Love Songs: కొత్తగా రాబోయే సినిమాలోనే కాదు.. ఇంతకు ముందే వచ్చిన సినిమాలో కూడా ఎక్కడ చూసినా లవ్ ట్రాక్స్ కనిపించేది. ప్రేమ పాటలే వినిపించేది. ఇక లేటెస్ట్ గా ఒక్క పాటతో ఇండియానే కాదు.. వరల్డ్ మొత్తాన్ని ఊపేశారు అల్లు అర్జున్. తన లవర్ శ్రీవల్లి మీద ప్రేమను ఎంత జనరస్ గా, ఓపెన్ గా క్లియర్ గా చెబుతూ చూపే బంగారమాయేనా సాంగ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయింది. భారీ సెట్టింగ్స్ లేకపోయినా, విజువల్స్ గ్రాండియర్ లేకపోయినా పాటలో ఫీల్ ఉంది కాబట్టి.. సూపర్ హిట్ అయ్యింది పాట.

DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. యాక్షన్ తో మాస్ ఫాన్స్ ని ఎలా ఎంగేజ్ చేస్తారో.. లవ్, రొమాంటిక్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అంతే మెస్మరైజ్ చేస్తారు. ఎన్టీఆర్ లవ్ సాంగ్స్ అంటే గుర్తొచ్చేది.. పూజాహెగ్డేతో పాడిన అరవింద సమేత సాంగ్. ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా హీరోయిన్ ని డిస్ క్రైబ్ చేస్తూ.. సాగిన ఫీల్ గుడ్ సాంగ్.. అనగనగా అరవిందట తన పేరు సాంగ్. క్రేజీస్టెప్స్ తో ఎన్టీఆర్ ని స్టైలిష్ కూడా చూపించిన ఈ పాట ఫాన్స్ కి తెగ నచ్చేసింది.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, సినిమా ఏజానర్ అయినా.. అందరికీ కనెక్ట్ అయ్యేది లవ్ స్టోరీలు. అందుకే ఇంటెన్స్ ఎమోషన్స్ తో పాడిన పాటలు.. ఆడియన్స్ కి ఇంకా కనెక్ట్ అవుతాయి. అందుకే స్టార్ హీరోల, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరూ లవ్ రొమాంటిక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటారు.

Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్

చరణ్.. ఈమధ్య కాలంలో పెద్దగా రొమాంటిక్ సాంగ్స్, సినిమాలు చెయ్యకపోయినా.. రామ్ చరణ్ లవ్ సాంగ్స్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఫేవరెట్ సాంగ్.. గోవిందుడుఅందరి వాడే సినిమాలోది. ఫారెన్ లొకేషన్స్ లో కాజల్, చరణ్ మీద పిక్చరైజ్ చేసిన రారా రాకుమారా సాంగ్.. సినిమా కన్నా పెద్ద హిట్ అయ్యింది.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఫస్ట్ నుంచి మాస్ సినిమాలు చేస్తున్నా.. కంప్లీట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది మాత్రం గీతగోవిందం. గీతగోవిందం తర్వాత ఆ రేంజ్ లో విజయ్ ని లవర్ బాయ్ గా చూపించినా సినిమాలు లేవనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అదీకాక ఫస్ట్ టైమ్ రష్మిక, విజయ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యి సినిమాకి మంచి మైలేజ్ ఇచ్చింది.

Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలెంటైన్స్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

పక్కింటబ్బాయిగా, లవర్ బాయ్ గా ఎప్పుడూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే నాని.. లేటెస్ట్ గా చేసిన శ్యామ్ సింగరాయ్ లో సాయిపల్లవికి జంటగా చేసిన సిరివెన్నెల సాంగ్ లవ్ ఎమోషన్ తో నిండిపోయింది. ఏవండోయ్ నాని గారూ అంటూ స్టెప్పులు వేసిన ఈసూపర్ హిట్ జోడి.. ఇప్పుడు సింగిల్ స్టెప్పు లేకుండానే ఆడియన్స్ ని అద్బుతమైన కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

సాయిపల్లవి తన ఎక్స్ ప్రెషన్స్ తో నాగచైతన్యతో చేసిన లవ్ స్టోరీని ఇలాగే ఆడియన్స్ ని కనెక్ట్ చేసింది. నాగచైతన్యకు మజిలీతో పాటు అంతుకుముందు చాలా సినిమాల్లో ఫీల్ గుడ్ రొమాంటిక్ సాంగ్స్ ఉన్నా.. లవ్ స్టోరీలో నీ చిత్రం చూసి పాట.. టాప్ ప్లేస్ కి వెళ్లిపోయింది. ఇలా హీరోలు.. వాలంటైన్స్ డేతో సంబంధం లేకుండా తమ సినిమాల్లో లవర్స్ కి ఆ రొమాంటిక్ లవ్ ఫీల్ ఇస్తూనే ఉన్నారు.