DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి కీరోల్స్ లో డీజే టిల్లు సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ..

DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు

Dj Tillu

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి కీరోల్స్ లో డీజే టిల్లు సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అయ్యింది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో కలెక్షన్ల మోత మోగిస్తుంది డీజే టిల్లు. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ టూర్స్ కూడా చేస్తుంది.

Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలంటైన్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

ఈ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే మేకర్స్ ఫుల్ హోప్ తో ఉన్నారు. వాళ్లు ఊహించినట్టుగానే ఆడియన్స్ డీజే టిల్లును ఆదరించారు. ఈ వీక్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఖిలాడి, సెహరి, ఎఫ్ ఐఆర్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టి ఫన్ రైడ్ లో ముందుకెళ్లాడు డీజే టిల్లు. సక్సెస్ రేస్ లో దూసుకెళ్తూ ఈ వీక్ రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలకు షాకిస్తున్నాడు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, డీజే టిల్లు లాంటి లోబడ్జెట్ సినిమాలు నిర్మించి సక్సెస్ కొట్టొచ్చని ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో శ్రీ చరణ్ సాంగ్స్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. ప్రమోషనల్ వీడియోస్ తోనే సగం సక్సెస్ అందుకున్న డీజే టిల్లు థియేటర్ లో తన స్టామినా చూపిస్తున్నాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక లిఫ్ట్ ఇచ్చాడు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ డైలాగ్స్ ఆయన చేసిన పెర్ఫామెన్స్ హైలెట్ కాగా నేహా శెట్టి గ్లామర్, పెర్ఫామెన్స్ అదనపు ఆకర్షణ. రిలీజ్ కు ముందే డీజే టిల్లు చుట్టూ ఒక బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ అయ్యాక భారీ కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు.