Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. హైదరాబాద్ లో చిరు, దుబాయ్ లో నాగ్, ఫిల్మ్ సిటీలో రామ్, ధనుశ్ ఇలా ఎక్కడివారక్కడ...

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

Telugu Films Shooting

Telugu Films Shooting: కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. హైదరాబాద్ లో చిరు, దుబాయ్ లో నాగ్, ఫిల్మ్ సిటీలో రామ్, ధనుశ్ ఇలా ఎక్కడివారక్కడ సెట్ అయ్యారు. సెట్స్ పై బిజీగా మారారు. ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్టులను స్పీడ్ అప్ చేస్తున్నారు. కోవిడ్ రీసెంట్ గా కోవిడ్ భారి నుంచి కోలుకున్నాక మోహన్ రాజ డైరెక్షన్ లో లూసీఫర్ సీక్వెల్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్, బాచుపల్లిలో జరుగుతుంది.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

బంగార్రాజుతో సంక్రాంతి హిట్ కొట్టిన నాగార్జున వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీ అయిపోయారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున లీడ్ రోల్ చేస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. కల్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది. రామ్ పోతినేని లింగు స్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న ది వారియర్.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మే నెలను రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ హై స్పీడ్ లో చేస్తున్నాడు రామ్.

F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

కొవిడ్ పీక్ లో ఉన్నప్పుడు కూడా సెట్స్ మీద రఫ్ఫాడించారు మాస్ రాజా. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ సినిమా షూట్ శామీర్ పేటలో జరుగుతోంది. ధనుష్ నటిస్తున్న తెలుగు స్ట్రైయిట్ మూవీ సార్ షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది.