Rajamouli: దట్ ఈజ్ జక్కన్న.. దండాలు పెట్టేస్తున్న బాలీవుడ్!

తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్, తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్.. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టిన..

Rajamouli: దట్ ఈజ్ జక్కన్న.. దండాలు పెట్టేస్తున్న బాలీవుడ్!

Rajamouli

Rajamouli: తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్, తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్.. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరంటే అన్ డౌటెడ్ గా రాజమౌళి అనే అంటారు అందరూ. అయితే బాహుబలితో వచ్చిన క్రేజ్ అక్కడే ఆగిపోకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్లు కూడా రాజమౌళి కాళ్లమీద పడేంత కంటిన్యూ అవుతోంది.

Pushpa: తగ్గేదేలే.. హీటెక్కిస్తున్న పుష్పరాజ్ లెక్కలు!

ఏ సినిమా అయినా హిట్ అయ్యిదంటే ఆ క్రేజ్, ఆ సక్సెస్ ఆ సినిమా వరకే ఉంటుంది. కానీ రాజమౌళికి మాత్రం అలా కాదు. ఏ ముహూర్తంలో బాహుబలిని పాన్ ఇండియా వైడ్ పరిచయం చేశాడో ఆ నిమిషం నుంచే తెలుగు టాప్ డైరెక్టరే కాదు.. ఆల్ ఓవర్ ఇండియా టాప్ డైరెక్టర్ గా మారిపోయారు రాజమౌళి. ఈ విషయం ఎవరో అనడం కాదు.. ఇప్పటి వరకూ టాలీవుడ్ ని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలే అంటున్నారు. అందుకే తమ సినిమాల్ని తెలుగులో ప్రమోట్ చెయ్యడం కోసం రాజమౌళిని వాడుకుంటున్నారు.

Latest Film Releases: ఎక్కడ చూసినా వీళ్లదే హవా.. దేశాన్ని చుట్టేస్తున్న స్టార్స్!

లేటెస్ట్ గా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న బ్రహ్మస్త్ర సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చింది టీమ్. 4 ఏళ్ల క్రితం మొదలై 3 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈవెంట్ లో బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అటెండ్ అయ్యారు. రణబీర్ అయితే ఇప్పటి వరకూ ఇండియాకు సంబంధించి టాప్ మోస్ట్ డైరెక్టర్లలో నంబర్ వన్ ప్లేస్ లో రాజమౌళే ఉంటాడంటూ కాళ్ల మీద పడిపోయాడు.

Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలే.. ఈ సీజన్‌లో డబ్బు తీసుకొని తప్పుకొనేదెవరు?

ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, క్రేజీ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ అయితే బ్రహ్మాస్త్రకి కథాసహకారం అందించమని రాజమౌళిని అడిగారు. అంతేకాదు.. తెలుగులో ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న రాజమౌళిని కరణ్ ఆకాశానికెత్తేశాడు. రాజమౌళి టాప్ డైరెక్టర్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదని, అసలు రాజమౌళి గాలి పీలుస్తున్న ప్లేస్ లో మనం ఉండడం నిజంగా లక్కీఅని తెగ పొగిడేశారు.

Sony Charishta: ఓరచూపుల భారీ అందాలు ఈ నేపాలీ బ్యూటీ సొంతం!

ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న అయాన్ అయితే.. నాకు సంబంధించినంత వరకూ ఇండియాలోనే కాదు.. వరల్డ్ లోనే ది బెస్ట్ టాప్ డైరెక్టర్ మీరే అంటూ రాజమౌళి కాళ్ల మీద పడిపోయాడు. ఆల్రెడీ సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ ఉన్న అయాన్.. రాజమౌళి దగ్గరకు స్టోరీ సిట్టింగ్స్ కోసం వస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి కథాసహకారం రాజమౌళి అందించడం, ఆయన నుంచి పని నేర్చుకోవడం నిజంగా నా అదృష్టం అని రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు అయాన్. ఇలా బాలీవుడ్ స్టార్లు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ రాజమౌళికి ఫిదా అయిపోయారు.