Latest Film Releases: ఎక్కడ చూసినా వీళ్లదే హవా.. దేశాన్ని చుట్టేస్తున్న స్టార్స్!

పుష్ప ప్రమోషన్స్ జోరు తగ్గింది. ఇక రాబోయే సినిమాల మేకర్స్ జనాలను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. దాని కోసం మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఒకరు రాబోయే మూడు వారాలు ..

Latest Film Releases: ఎక్కడ చూసినా వీళ్లదే హవా.. దేశాన్ని చుట్టేస్తున్న స్టార్స్!

Latest Film Releases

Latest Film Releases: పుష్ప ప్రమోషన్స్ జోరు తగ్గింది. ఇక రాబోయే సినిమాల మేకర్స్ జనాలను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. దాని కోసం మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఒకరు రాబోయే మూడు వారాలు మామూలుగా ఉండదని చెప్తుంటే.. మరొకరు అభిమానులే మా అతిథులని కొత్త కలరింగ్ ఇస్తున్నారు. ఇంకొకరు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. నేషనల్ వైడ్ ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ ట్రిపుల్ ఆర్ జోరు పెంచింది. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో.. వచ్చే మూడు వారాలు మామూలుగా ఉండవని ప్రకటించారు మేకర్స్.

Bigg Boss 5 Telugu: గ్రాండ్ ఫినాలే.. ఈ సీజన్‌లో డబ్బు తీసుకొని తప్పుకొనేదెవరు?

దేశం మొత్తం తిరుగుతూ భారీ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడమే మా పనంటూ డైరెక్ట్ గానే ట్వీట్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ ఆదివారం జరుగబోయే ముంబై ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ని హోస్ట్ చేస్తాడని.. సల్మాన్ ఖాన్ గెస్ట్ గా వస్తారని ఇప్పటికే న్యూస్ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తో పాటు బాలీవుడ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు రాధేశ్యామ్. అభిమానులే మా అతిథులనే కాన్సెప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు రాధేశ్యామ్. ఈ నెల 23న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ నేషనల్ ఈవెంట్ కి ప్రిపేర్ అవుతుంది మూవీ యూనిట్.

Sony Charishta: ఓరచూపుల భారీ అందాలు ఈ నేపాలీ బ్యూటీ సొంతం!

దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల మీదుగా రాధేశ్యామ్ ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయించబోతున్నారు. ఆపై వరుసగా దేశంలోని ఇంపార్టెంట్ సిటీస్ లో ఫ్యాన్స్ ను పలకరించేలా కూడా సపరేట్ అట్రాక్టివ్ రూట్ ప్లాన్ చేశారు. సంక్రాంతికి థియేటర్స్ లోకి దూకబోతున్న రాధేశ్యామ్.. ఆలోపు ఫ్యాన్స్ కు కనెక్టయ్యేలా క్యాలెండర్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక, నేచురల్ స్టార్ నాని సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ ను నిలబెట్టేలా ప్రచారాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు.

RRR: అమెరికాలో మొదలైన ఆర్ఆర్ఆర్ రచ్చ.. ప్రీ బుకింగ్ రికార్డులు!

వరంగల్ లో శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించిన టీమ్.. ఆ తర్వాత చెన్నైలో సందడి చేసింది. అక్కడ ఈ సినిమా తమిళ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక వెరీ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ లో హల్చల్ చేశాడు నాని. శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో సాయి పల్లవి కూడా అట్రాక్షన్ గా మారింది. సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రిలీజ్ అవుతోన్న శ్యామ్ సింగ రాయ్ పై బాగా నమ్మకాన్ని చూపిస్తున్నాడు నాని. క్రిస్ మస్ మనదే అంటోన్న శ్యామ్ సింగ రాయ్ లెక్కలేంటో ఈ నెల 24న తేలిపోతాయి.