The Kashmir Files: ఆగని కలెక్షన్లు.. 200 కోట్ల క్లబ్‌లోకి కాశ్మీర్ ఫైల్స్!

ఒక స్టార్ హీరో లేడు.. హీరోయిన్ తో డ్యూయెట్ లేదు.. మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అసలే లేవు. కానీ చిన్న సినిమాగా రిలీజై భారీ కలెక్షన్స్ రాబడుతుంది ది కశ్మీర్ పైల్స్. రోజురోజుకి..

The Kashmir Files: ఆగని కలెక్షన్లు.. 200 కోట్ల క్లబ్‌లోకి కాశ్మీర్ ఫైల్స్!

Kashmir Files (1)

The Kashmir Files: ఒక స్టార్ హీరో లేడు.. హీరోయిన్ తో డ్యూయెట్ లేదు.. మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అసలే లేవు. కానీ చిన్న సినిమాగా రిలీజై భారీ కలెక్షన్స్ రాబడుతుంది ది కశ్మీర్ పైల్స్. రోజురోజుకి పెరుగుతున్న కలెక్షన్స్.. కమర్షియల్ మేకర్స్ మతి పొగొడుతున్నాయి. ఓ భయంకరమైన చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించి.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నది కశ్మీర్ ఫైల్స్ సినిమా. రోజురోజుకి బాక్సాఫీస్ లెక్కలు డౌన్ ఫాల్ అవుతున్న రోజుల్లో.. ఈ సినిమా కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద ట్వీట్ చేసిన ఐఏఎస్‌కు నోటీసులు

అసలే అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ 5 రోజుల్లో 60కోట్ల 20లక్షలను రాబట్టగా అక్కడ నుండి మొదలైన పాజిటివ్ టాక్ హోరులా మారి రూ.వంద కోట్లు.. రూ.150 కోట్లు.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. దేశవ్యాప్తంగా 600 థియేటర్స్ లో రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్.. అంతకంతకు పెరిగి 4000 థియేటర్ల వరకు చేరింది. హ్యూజ్ లెవెల్ పబ్లిసిటీ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెంచేసుకుంటున్నారు. 10 కోట్లతో వచ్చిన ఒరిజనల్ స్టోరీ ది కశ్మీర్ ఫైల్స్.. లాంగ్ రన్ లో 200 కోట్లను సంపాదించి రికార్డులు సృష్టించింది.

The Kashmir FIles: ”ద కశ్మీర్ ఫైల్స్’ ఆదాయాన్ని బ్రాహ్మణ కుటుంబాలకు విరాళమివ్వండి’

వివేక్ డైరెక్షన్.. అనుపమ్ కేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషీ వంటి వారి నటన సినిమాకి బూస్టప్ నివ్వగా.. 1990లో కశ్మీరి పండిట్స్ పై జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ప్రేక్షకులను థియేటర్ నుండి బయటికొచ్చాక కూడా వాళ్లని సీన్స్ వెంటాడుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అయిపోయారు. తొలి పదిరోజుల వసూళ్లతో పోలిస్తే కాస్త దూకుడు తగ్గినా అవలీలగా 13 రోజులలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేస్తుంది. కాగా శుక్రవారం ఆర్ఆర్ఆర్ రిలీజ్ నేపథ్యంలో కాశ్మీర్ ఫైల్స్ తట్టుకొని నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.