The Kashmir FIles: ”ద కశ్మీర్ ఫైల్స్’ ఆదాయాన్ని బ్రాహ్మణ కుటుంబాలకు విరాళమివ్వండి’

కశ్మీర్ లోయలో జరిగిన ఉదంతాలపై తీసిన సినిమా ద కశ్మీర్ ఫైల్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజాదరణను దక్కించుకున్న ఈ సినిమాపై పలువురు విమర్శలను సైతం ఎదుర్కొంటుంది.

The Kashmir FIles: ”ద కశ్మీర్ ఫైల్స్’ ఆదాయాన్ని బ్రాహ్మణ కుటుంబాలకు విరాళమివ్వండి’

The Kashmir Files

The Kashmir FIles: కశ్మీర్ లోయలో జరిగిన ఉదంతాలపై తీసిన సినిమా ద కశ్మీర్ ఫైల్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజాదరణను దక్కించుకున్న ఈ సినిమాపై పలువురు విమర్శలను సైతం ఎదుర్కొంటుంది. దేశ ప్రధాని సైతం సినిమాను మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే, సినిమా వల్ల వచ్చిన ఆదాయాన్ని కథ తీయడానికి ఆధారమైన బ్రాహ్మణ కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని అంటున్నారు మధ్యప్రదేశ్ లో సేవలందిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్.

‘ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ముస్లింల హత్యలు, పైగా వాళ్లని పురుగులుగా చూస్తున్నారు. వాళ్ల కూడా ఇండియన్ సిటిజన్స్ కదా’ అని ఐఏఎస్ ఆఫీసర్ చేసిన కామెంట్ కు.. ఆ రాష్ట్ర మంత్రి అయిన విశ్వాస్ శరంగ్ నుంచి ఘాటైన రిప్లై వచ్చింది. ఆ ఆఫీసర్ కూడా అందులో వాడేనని(సెక్టారియన్)తో పోలుస్తూ.. డిప్యూటీ సెక్రటరీ పదవి నుంచి తొలగించాలని అన్నారు.

ఆ తర్వాత ఆఫీసర్ నియాజ్ ఖాన్.. ద కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్ కు రిక్వెస్ట్ పంపారు. సినిమాకు వచ్చిన ఆదాయమంతా బ్రాహ్మిణ్ కుటుంబాల్లోని పిల్లలు చదువు, ఇళ్లు లేని వారికి నివాసం కల్పించడానికి వినియోగించాలని రిక్వెస్ట్ చేశారు. అతని ట్వీట్లు వైరల్ కావడంతో ఫిల్మ్ డైరక్టర్ వివేక్ అగ్రిహోత్రి మాట్లాడేందుకు గానూ ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు.

Read Also : ‘ది కశ్మీర్ ఫైల్స్’.. బడ్జెట్ 15 కోట్లు.. వారంరోజుల్లో 100 కోట్లు.. 200 కోట్లకు పరుగులు..

‘కశ్మీర్ ఫైల్ బ్రాహ్మిణ్స్ బాధను చూపించింది. వాళ్లు కూడా గౌరవప్రదమైన జీవితాలు గడపాలి. ప్రొడ్యూసర్ అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ముస్లిం హత్యల గురించి కూడా సినిమా తీయాలి. ముస్లింలు పురుగులు కాదు. దేశానికి పౌరులే’ అని ఖాన్ అన్నారు.