The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’.. బడ్జెట్ 15 కోట్లు.. వారంరోజుల్లో 100 కోట్లు.. 200 కోట్లకు పరుగులు..

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మొదటి రోజు చిన్న సినిమాగా దేశ వ్యాప్తంగా కేవలం 300 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి.......

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’.. బడ్జెట్ 15 కోట్లు.. వారంరోజుల్లో 100 కోట్లు.. 200 కోట్లకు పరుగులు..

The Kashmir Files Collections

The Kashmir Files :  డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 1990 లలో కశ్మీర్ లో హిందూ పండిట్లపై, హిందువులపై జరిగిన మారణకాండ ఆధారంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ తెరకెక్కింది. ఈ సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మొదటి రోజు చిన్న సినిమాగా దేశ వ్యాప్తంగా కేవలం 300 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి రోజే 3.5 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది.

ఆ తర్వాత కేవలం మౌత్ టాక్ తోనే సినిమాకి మరింత ఆదరణ పెరిగింది. నరేంద్ర మోడీతో సహా పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాని చూసి అభినందించడం, జరిగిన నిజాలని నిర్భయంగా చూపించడంతో ఈ సినిమా ఒక్కసారిగా పాపులర్ అయింది. రెండో రోజు సినిమాకి మరి కొన్ని థియేటర్లు పెరగగా రెండో రోజు దాదాపు 8 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రోజు రోజుకి సినిమాకి ఆదరణ పెరగడంతో థియేటర్లు కూడా పెంచారు. మూడో రోజు నుంచి దేశ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. మూడో రోజు ఈ సినిమా 15 కోట్లు కలెక్ట్ చేసింది.

The Kashmir Files : తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ మూవీని టాక్స్ ఫ్రీ చేయాలి.. రాజాసింగ్ కామెంట్స్..

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా నాలుగో రోజు 15 కోట్లు, ఐదో రోజు 18 కోట్లు, ఆరో రోజు 19 కోట్లు, ఏడో రోజు 18 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మొదటి వారం ఈ సినిమా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేయడంతో బాలీవుడ్ షాక్ అయింది. వారం రోజులు గడుస్తున్నా సినిమాకి ఇంకా ఆదరణ పెరుగుతూనే ఉంది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

సినిమా రిలీజ్ అయిన రెండో వారంలో స్క్రీన్స్ ఇంకా పెరగడం విశేషం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్స్ లో ఈ సినిమా నడుస్తుంది. ఇక సినిమా విడుదల అయిన ఎనిమిదో రోజు దాదాపు 19 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మొత్తం 120 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమా 150 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని చెప్తుంటే మరి కొంతమందే ఈజీగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ వీకెండ్ లోపు అని అంటున్నారు. మార్చ్ 25న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాబోతుంది. అప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లకి ఢోకా లేదు అని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఒక చిన్న సినిమాగా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి ఇప్పుడు అత్యధిక థియేటర్లలో రన్ అవుతూ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200 కోట్లకు పరుగులు పెట్టడం విశేషం.