The Kashmir Files : తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ మూవీని టాక్స్ ఫ్రీ చేయాలి.. రాజాసింగ్ కామెంట్స్..

తాజాగా ఈ సినిమాపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. ఈ సినిమా చూసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. ''ప్రజలు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని చూడడానికి....

The Kashmir Files : తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ మూవీని టాక్స్ ఫ్రీ చేయాలి.. రాజాసింగ్ కామెంట్స్..

Raja Singh

Raja Singh :  జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా మార్చ్ 11న రిలీజై అంచనాలకి మించి భారీ విజయం సాధిస్తుంది. కాశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమాని చూసి అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి అద్భుతమైన సినిమా అని మెచ్చుకుంటున్నారు. నరేంద్రమోడీ సైతం ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించారు.

 

తాజాగా ఈ సినిమాపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. ఈ సినిమా చూసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. ”ప్రజలు ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని చూడడానికి ఉత్సాహంతో థియేటర్ కి వెళ్తున్నారు. ఇందులో నిజాలు చూపించారు అని మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణలో కూడా థియేటర్లలో హౌజ్ ఫుల్ అవుతుంది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాకి చాలా రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని టాక్స్ ఫ్రీ చేయలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను” అని తెలిపారు.

The Kashmir Files : ఈ సినిమాతో బాలీవుడ్ పాపాలని కడిగేశారు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కంగనా వ్యాఖ్యలు..

తెలంగాణ టిఆర్ఎస్ నాయకులని ఉద్దేశించి.. ”కశ్మీర్ లో పండితులు, హిందువులపై జరిగిన దాడిని ఇందులో చూపించారు. మీరు కూడా ఈ సినిమాని ఫ్యామిలితో చూడాలని కోరుతున్నాను. మీరు ఈ సినిమా చేస్తే ఎవరితో దోస్తాన్ చేయాలని, ఎవరితో వద్దని మీకు తెలుస్తది. తెలంగాణను ఒకప్పుడు భారతదేశంలో కాకుండా పాకిస్థాన్ లో కలపాలని కాశిం రిజ్వి చూసారు. కాశిం రిజ్వికి ఫాలోవర్ గానే ఎంఐఎం ఉంది. అసలు వీళ్ళు దేశ భక్తులా, దేశ ద్రోహులా అని సినిమా చూస్తే తెలుస్తుంది” అని అన్నారు.