The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద ట్వీట్ చేసిన ఐఏఎస్‌కు నోటీసులు

ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్వీట్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు నోటీసులు పంపింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాపై కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తున్నారనే నోటీసులు..

The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద ట్వీట్ చేసిన ఐఏఎస్‌కు నోటీసులు

Kahsmir Files

Updated On : March 24, 2022 / 11:27 AM IST

The Kashmir Files: ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్వీట్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు నోటీసులు పంపింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాపై కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తున్నారనే నోటీసులు పంపామని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం అన్నారు.

ఎంపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఖాన్.. గత వారం చేసిన ట్వీట్ ద కశ్మీర్ ఫైల్స్ చేసిన తీరులోనే పలు రాష్ట్రాల్లో అతిపెద్ద సంఖ్యలో హత్యలకు గురవుతున్న ముస్లింల గురించి కూడా సినిమా తీయాలని అన్నారు. మైనారిటీ కమ్యూనిటీల్లో ఉండే వారు పురుగులు కాదు. వాళ్లు కూడా దేశ పౌరులేనని ప్రస్తావించారు.

దీనిపై మాట్లాడిన హోం మంత్రి.. ‘నేను ఖాన్ ట్వీట్లు చూశాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన లక్ష్మణ్ రేఖను దాటేశారు. అతనికి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తుంది. అతని నుంచి వచ్చే బదులు కోసం చూస్తున్నాం’ అని అన్నారు.

Read Also: ‘ది కశ్మీర్ ఫైల్స్’పై అమీర్ ఖాన్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

ఐఏఎస్ ఆఫసర్ ఖాన్.. తాను కూడా పుస్తకం రాయాలనుకుంటున్నానని ‘ముస్లింల నరమేధం’ అనే అంశంపై రాస్తానంటూ చెప్పారు. అప్పుడు ద కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను ఎవరో ఒకరు నిర్మిస్తారని మైనారిటీల బాధలు, వ్యధలు తెలుస్తాయంటూ కామెంట్ చేశారు.

ఆ తర్వాత చేసిన కామెంట్లలో ద కశ్మీర్ ఫైల్స్ ద్వారా వచ్చిన డబ్బును కశ్మీరీ పండిట్స్ పిల్లలకు, కశ్మీర్‌లో వాళ్ల ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించాలని పిలుపునిచ్చారు. అతని వరుస ట్వీట్లకు రెస్పాండ్ అయిన ఫిల్మ్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఖాన్ అపాయింట్మెంట్ ఇస్తే కొన్ని విషయాలు మాట్లాడాలని ట్వీట్ చేశారు.