RRR: అప్పుడు ఆ రాముడు.. ఇప్పుడు రాముడు.. ఫ్యాన్స్ పండగ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన..

RRR: అప్పుడు ఆ రాముడు.. ఇప్పుడు రాముడు.. ఫ్యాన్స్ పండగ!

Rrr (1)

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు సైతం నటించి, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

మార్చి 25న ఈ సినిమా విడుదల కానుండగా.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టగా మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కొత్త పాట రానుంది. మార్చి 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ అదరగొట్టగా రకరకాల గెటప్స్ తో స్వతంత్ర పోరాట యోధులను గుర్తు చేశారు.

Rrr

Rrr

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

తారక్-చరణ్-అలియా ముగ్గురూ స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ నటించగా.. అందులో ఎన్టీఆర్ రెండు చోట్ల పంచెకట్టులో కనిపించాడు. అందులో కూడా టంగుటూరి ప్రకాశం పంతులును గుర్తు చేసుకుంటూ పంచె కట్టుతో భుజంపై కండువా వేసుకున్న గెటప్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో టంగుటూరి స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసిన అభిమానులు.. అప్పుడు ఆ రాముడు.. ఇప్పుడు ఈ రాముడు పంచెకట్టుతో అదరగొట్టారని తెగ వైరల్ చేస్తున్నారు.