RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ‘ఎత్తర జెండా’..

RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

RRR

RRR: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ నుండి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ‘ఎత్తర జెండా’ అనే ఓ అద్భుతమైన ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల దర్శకుడు రాజమౌళి అనౌన్స్ చేయడంతో ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అయితే మార్చి 14న సాయంత్రం 4 గంటలకు ఈ పాటను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పాటను రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ పేర్కొంది.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

దీంతో అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక ఈ పాటను మార్చి 15న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ‘ఎత్తర జెండా’ పాటను ఇవాళ సాయంత్రం 7 గంటలకే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఈ పాటకోసం ఆసక్తిని రేకెత్తించారు. అయితే అనుకున్న సమయానికి ఈ పాటను రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం వారిలో నెలకొంది.

కానీ ఈసారి చెప్పిన సమయానికే ‘ఎత్తర జెండా’ పాటను రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్. ఇక ఈ పాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన డ్యాన్స్ వేరే లెవెల్‌లో ఉందని చెప్పాలి. ఇద్దరు మేటి డ్యాన్సర్లను ఒకే స్క్రీన్‌పై చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. కాగా డ్యాన్స్‌మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

RRR: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. ఆర్ఆర్ఆర్ నుండి మరో పాట

ఇక భారతదేశ అమరవీరులను ఈ పాటలో మనకు చూపించారు చిత్ర యూనిట్. అటు ఇద్దరు హీరోలతో పాటు హీరోయిన్ ఆలియా భట్ కూడా వేసిన స్టెప్పులు అదుర్స్. ఈ పాటను సినిమా చివర్లో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న ‘ఎత్తర జెండా’ పాటను మీరు ఓసారి చూసేయండి.