Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ ట్రిపుల్ ధమాకా.. 3 మడత ఫోన్లు రెడీ.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్!
Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. BISలో ఈ శాంసంగ్ మూడు ఫోన్లు లిస్ట్ అయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు రాబోతున్నాయి. లాంచ్ కు నెల ముందే ఈ మడతబెట్టే ఫోన్లకు సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి.

ఈ స్మార్ట్‌ఫోన్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 తో పాటుగా లాంచ్ కానుంది. అయితే, శాంసంగ్ అల్ట్రా ఫోన్ మోడల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్సైట్లో SM-F976B మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. కానీ, ఈ లిస్టులో ఎలాంటి స్పెసిఫికేషన్లు రివీల్ చేయలేదు.

రాబోయే శాంసంగ్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 200MP ప్రైమరీ కెమెరా, 50MP, అల్ట్రా-వైడ్ కెమెరా 10MP టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ డ్యూయల్ 10MP కెమెరాలు ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫోల్డ్ ఓపెన్ చేస్తే మందం 4.1 మి.మీ ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రాలో 5,000mAh బ్యాటరీ ఉండొచ్చు.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 రావొచ్చు. వచ్చే నెల లండన్‌లో జరిగే శాంసంగ్ 'గెలాక్సీ అన్ప్యాక్డ్' ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8తో పాటు శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌కు యూజర్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26+ గెలాక్సీ S26 అల్ట్రా అనే 3 మోడళ్లు ఉన్నాయి.

నివేదిక ప్రకారం.. లాంచ్ అయిన మొదటి 6 వారాల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ సేల్స్ గత ఏడాదిలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ కన్నా సుమారు 15 శాతం ఎక్కువగా ఉన్నాయి. యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాకు ఎక్కువ డిమాండ్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరగలేదు. కొత్త ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ కారణంగా ఎక్కువ మంది కొనేస్తున్నారు.

Samsung Galaxy Z Fold 8 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు రాబోతున్నాయి. లాంచ్ కు నెల ముందే ఈ మడతబెట్టే ఫోన్లకు సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి.

