RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు..

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

Rrr

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లు సైతం నటించి, ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే సినిమా కావడంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

RRR: ఆకాశమే హద్దుగా తారక్ మాసివ్ క్రేజ్..!

మార్చి 25న ఈ సినిమా విడుదల కానుండగా.. మరో రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ టీం ప్రమోషన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం గతంలో భారీగా ఖర్చు పెట్టగా మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కొత్త పాట రానుంది. మార్చి 14న ఎత్తరా జెండా అనే పాటని విడుదల చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సెలెబ్రేషన్ యాంతం అంటూ ఈ పాటని రిలీజ్ చేయనుండగా.. శనివారం సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

RRR: క్రేజీ మల్టీస్టారర్‌కు రెండే వారాలు.. జక్కన్నా ఇక నీదే లేట్!

ఈ ప్రోమోలో హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ ఓ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందులో హీరోలు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎత్తర జెండా పాటలో కనిపించిన జెండా ఈనాటి మన జాతీయ జెండా కాదు. మరి ఆ జెండా వెనక కథేంటి అని సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ కథ మన దేశానికి స్వాతంత్రానికి ముందు నాటి కథ కాగా.. పాటలో కనిపించే జెండా 1907 నాటి కాలానికి చెందినది.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

అసలు మన దేశానికి సంబంధించి ఈ జెండా వెనక కథను చూస్తే 1906లో జెండా పై భాగంలో కాషాయం, కింద భాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు రంగులతో ఒక జెండాను రూపొందించగా మధ్యలో వందే మాతరం అని హిందీలో అక్షరాలు ఉండేవి. ఆ తర్వాత 1907లో పై భాగంలో ఆకుపచ్చ, కింద భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులలో వందే మాతరం అక్షరాలు రాసిన జెండాగా మార్చారు. అదే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కనిపించిన జెండా. ఈ జెండా 1907 నుండి 1917 కాలం వరకు భారతీయ జెండాగా కనిపించేది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలు ఎంతో తెలుసా??

ఆ తర్వాత 1917లో బ్రిటిష్ జెండాను పోలిన ఓ జెండాను రూపొందించగా.. 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో నూలు వడికే రాట్నం గుర్తు కలిగిన జెండా.. ఆ తర్వాత 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రానుగులతో నూలు వడికే రాట్నం గుర్తును మధ్యలో తెలుపుపై మాత్రమే కనిపించేలా జెండాను మార్చారు. ఇక స్వతంత్ర అనంతరం అదే జెండాను స్వల్ప మార్పులతో.. మధ్య రాట్నం బదులుగా అశోక చక్రంతో అధికారికంగా మన జాతీయ జెండా ఆవిష్కృతమైంది.