Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

ఫిబ్రవరి నుంచి సినిమాలు స్పీడందుకున్నాయి. మొన్నటి వరకూ ధియేటర్లెందుకు రిస్క్ అనుకున్న మేకర్స్.. ఇప్పుడు నెమ్మదిగా ధియేటర్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ధియేటర్లకు పోటీగా ఓటీటీలు..

Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

Telugu Films Release

Telugu Films Release: ఫిబ్రవరి నుంచి సినిమాలు స్పీడందుకున్నాయి. మొన్నటి వరకూ ధియేటర్లెందుకు రిస్క్ అనుకున్న మేకర్స్.. ఇప్పుడు నెమ్మదిగా ధియేటర్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ధియేటర్లకు పోటీగా ఓటీటీలు కూడా స్టార్ మూవీస్ తో రిలీజ్ కు సై అంటున్నాయి. ఈ వారం అటు ధియేటర్లో ఇటు ఓటీటీలు పోటాపోటీగా సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి.

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

ఈ వీకెండ్ సందడిని మాస్ మహారాజా తన సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాకూడా తగ్గేదే లే అని ధియేటర్లోనే సినిమా రిలీజ్ చేస్తున్నారు. మాస్ మహారాజ రవితేజ, రమేష్ వర్మ డైరెక్షన్లో క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న మూవీ ఫిబ్రవరి 11 న ధియేటర్లోకి వస్తోంది. రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ ఖిలాడి ఈసారి బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ.. ఈ సారి అదే మాస్ పవర్ తో ఖిలాడితో మరో హిట్ అందుకుంటారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫాన్స్.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

రవితేజ సినిమాతో పోటీపడుతోంది సెహరి. సినిమా ప్రమోషన్స్ తో అప్పట్లో బాలయ్య ఇన్వాల్వ్ అవ్వడంతో ఆడియన్స్ లోమంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సెహరి సాంగ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11నే ధియేటర్లో రిలీజ్ కాబోతోంది. రవితేజ శుక్రవారం టార్గెట్ పెట్టుకుంటే.. యంగ్ హీరో సిద్దు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డి.జె టిల్లు ఫిబ్రవరి 12న శనివారం ఆడియన్స్ ముందుకొస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో తెరకెక్కిన ఈసినిమా జనవరి రేస్ నుంచి ఫిబవరికి షిఫ్ట్ అయ్యింది. ముందు ఫిబ్రవరి 11న రిలీజ్ అని అనౌన్స్ చేసిన డిజె. టిల్లు ఇప్పుడు రవితేజతో క్లాష్ ఎందుకని ఫిబ్రవరి 12కి షిఫ్ట్ అయ్యింది. సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన డిజె.టిల్లు వీకెండ్ కి ధియటర్లోకొస్తోంది.