Today Gold Price : స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర

శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరుగంటల వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. బంగారం ధరలు స్థిరంగా ఉండటం శుభవార్తనే చెప్పాలి.

Today Gold Price : స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర

Today Gold Price (2)

Today Gold Price : శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరుగంటల వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. బంగారం ధరలు స్థిరంగా ఉండటం శుభవార్తనే చెప్పాలి. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు మూడు రోజులు స్థిరంగా ఉన్నాయి. మిగతా రోజుల్లో స్వల్పంగా మార్పులు జరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై పడుతుందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకి బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతుందని బిలియన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : Gold Today Rates : బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు పెరిగే అవకాశం

ఇక బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండిపై రూ.300 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండిపై రూ.100 తగ్గి కేజీ రూ. 65,600 దిగొచ్చింది. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారంలో వెండి ధర రూ.1000 వరకు తగ్గింది.

చదవండి : Gold locket for Cat Gift :పెంపుడు పిల్లికి రూ.4 లక్ష‌ల విలువైన గోల్డ్ లాకెట్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

చదవండి : Today Gold  Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.