Upcoming Movies : విడుదల వాయిదా.. వేరే దారి లేదు..

భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలతో పాటు తర్వాత రాబోయే సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయి..

Upcoming Movies : విడుదల వాయిదా.. వేరే దారి లేదు..

Upcoming Movies

Upcoming Movies: కరోనా వైరస్.. రెండు సార్లు లాక్ డౌన్.. అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. షూటింగ్స్ నిలిచిపోయి, థియేటర్లు మూతబడి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఒమిక్రాన్ దెబ్బ మీద దెబ్బ కొట్టింది.

Sushanth : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..

దీంతో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వాయిదా పడడంతో సినీ పరిశ్రమ మరోసారి ఊహించని షాక్‌కి గురైంది. దీంతో ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న మరిన్ని సినిమాలు వెనక్కి వెళ్లక తప్పేలా కనిపించడంలేదు.

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

జనవరి నుండి ఫిబ్రవరికి షిఫ్ట్ అయిన ‘ఆచార్య’, సంక్రాంతి బరినుండి సమ్మర్‌కి వెళ్లి ఏప్రిల్ 1న రావాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కూడా పోస్ట్ పోన్ కానుంది. ఇటీవలే మహేష్ కోవిడ్ బారినపడడం, ఇంతలో మహేష్ సోదరుడు మరణించడం వంటి షాకింగ్ సంఘటనలు జరిగాయి. దీంతో కొంత షూటింగ్ పెండింగ్ ఉన్న ఈ సినిమా కూడా వాయిదా పడక తప్పడంలేదు.

Acharya : ‘చిరుత’నయుడు.. టీజర్ చివరి షాట్ అదిరిందిగా

సంక్రాంతికి పెద్ద సినిమా ‘బంగార్రాజు’ మాత్రమే విడుదలవుతోంది. ‘రౌడీ బాయ్స్’, మహేష్ మేనల్లుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘హీరో’ సినిమాలు కూడా పండక్కి వస్తున్నాయి. మరి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ సమ్మర్‌కి వస్తాయా?.. ‘ఆచార్య’, ‘ఖిలాడి’, ‘భీమ్లా నాయక్’, ‘ఎఫ్ 3’, ‘సర్కారు వారి పాట’ పరిస్థితి ఏంటి?.. టాలీవుడ్ అప్ కమింగ్ సినిమాల విషయంలో మరోసారి విడుదల తేదీల మధ్యం వివాదం చోటు చేసుకోనుందా అనే విషయాలపై ఫిలింవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది..

Bangarraju Trailer : అక్కినేని తండ్రీకొడుకులు అదరగొట్టారుగా!