Bangarraju Trailer : అక్కినేని తండ్రీకొడుకులు అదరగొట్టారుగా!
‘బంగార్రాజు బావగారు.. చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు’.. అలరిస్తున్న ‘బంగార్రాజు’ థియేట్రికల్ ట్రైలర్..

Bangarraju Trailer
Bangarraju Trailer: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తున్నారు.
Naga Chaitanya : ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చాడయ్యా ‘బంగార్రాజు’..
‘శివగామి’ రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అండ్ సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మంగళవారం సాయంత్రం ‘బంగార్రాజు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Unstoppable with NBK : ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్ ‘అర్జున్ రెడ్డి’
‘బంగార్రాజు బావగారు.. చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు’ అనే డైలాగుతో స్టార్ట్ అయిన ట్రైలర్ రచ్చ రంబోలా రేంజ్‌లో ఉంది. నాగ్ ఆ తర్వాత చై ఇద్దరూ అమ్మాయిల మనసుల్ని కొల్లగొడుతూ మన్మథులను తలపించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలయిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ పోస్ట్ పోన్ అవడంతో ‘బంగార్రాజు’ కి లైన్ క్లియర్ అయింది. జనవరి 14న సంక్రాంతి బరిలో దిగబోతున్న అక్కినేని తండ్రీకొడుకులు ‘సోగ్గాడే’ మ్యాజిక్ రిపీట్ చేస్తూ పక్కా బ్లాక్‌బస్టర్ కొడతామని ధీమాగా ఉన్నారు.