Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ పోస్టర్‌లో ఇంత అర్థం ఉందా?..

Radhe Shyam : ఒకే గుండెకు రెండు చప్పుళ్లు.. దీంట్లో ఇంత మీనింగ్ ఉందా!?

One Heart.. Two Heart Beats

Updated On : November 29, 2021 / 6:55 PM IST

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకి, ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి చాలా చక్కటి స్పందన వచ్చింది. సోమవారం ‘రాధే శ్యామ్’ నుండి వదిలిన లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్)కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Aashiqui Aa Gayi : మైండ్ బ్లోయింగ్ మెలోడీ… ప్రభాస్ కెరీర్‌లో చూసి ఉండరు..

అయితే ఈ లవ్ ఆంథమ్ అనౌన్స్‌మెంట్ అప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ మీద వేసిన కొటేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ పోస్టర్ పైన One Heart.. Two Heart Beats.. అని వేశారు. అంటే ఒకే సినిమానే అయినా కూడా రెండు భాషలకు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని దీని అర్థం.

Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం అనేది ఇదే తొలిసారి. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. దీనికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!