Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

డైరెక్టర్లు అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడం లేదు.. ఒక వైపు సీరియస్ గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు టైమ్ దొరికినప్పుడు అంతే..

Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

Web Series Telugu

Web Series Telugu: డైరెక్టర్లు అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడం లేదు.. ఒక వైపు సీరియస్ గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు టైమ్ దొరికినప్పుడు అంతే సీరియస్ గా వెబ్ సిరీస్ ల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. మొన్నీమధ్య వరకూ ఓటీటీ లను పెద్దగా పట్టించుకోని స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు ఓటీటీ మీద ఫుల్ గా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హరీష్ శంకర్, దిల్ రాజు కలసి వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

ఇన్ని ధియేటర్లుంటే.. ఓటీటీలవైపు ఎవరు చూస్తారని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఓటీటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందుకే స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హరీష్ శంకర్, దిల్రాజు లాంటి టాప్ మూవీ మేకర్స్ ఏటీఎమ్ అనే ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ అందించిన కథను దిల్ రాజు గ్రాండ్ గా ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో ఎంగేజ్ అయ్యారు. ఇక దిల్ రాజు ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా సరే మెయిన్ స్ట్రీమ్ సినిమాతోపాటు డిఫరెంట్ కంటెంట్ తో వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కాంబినేషనే కాకుండా తెలుగులో హ్యాపెనింగ్ డైరెక్టర్స్ క్రిష్, నాగాశ్విన్ లాంటి డైరెక్టర్లుకూడా వెబ్ సిరీస్ లు చేసి ఎంటర్ టైన్ చేశారు.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

సుకుమార్ కూడా పుష్పమూవీ కంటెంట్ ని వెబ్ సిరీస్ లు గా చేద్దామన్న ప్లాన్ లో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. వీళ్లే కాకుండా యాస్పైరింగ్ డైరెక్టర్లు చాలా మంది తరుణ్ భాస్కర్, ప్రవీణ్ సత్తారు కూడా పిట్టకథలు, లెవెన్త్ అవర్ లాంటి ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ లతో హిట్లు కొట్టారు. ఇలా టాప్ మేకర్స్ కూడా ఓటీటీలో తమహవా చూపించడానికి రెడీ అయిపోయారు.