Udanpirappe : జ్యోతిక 50వ సినిమా.. ట్రైలర్ చూశారా..

వెర్సటైల్ యాక్టర్ సూర్య భార్య జ్యోతిక నటిస్తున్న 50వ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది..

Udanpirappe : జ్యోతిక 50వ సినిమా.. ట్రైలర్ చూశారా..

Jo 50

Udanpirappe: ఒకప్పడు స్టార్ హీరోయిన్‌గా తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరించిన జ్యోతిక.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే వెర్సటైల్ యాక్టర్ సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించేసింది. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ లేడీ ఓరియంటెండ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటుంది జ్యోతిక. ‘36 వయదినిలే’, ‘మగలిర్ మట్టుమ్’, ‘రాచ్చసి’, ‘జాక్‌పాట్’ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు నటిగా జ్యోతిక 50వ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Srivalli Song : ‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేస్తోంది..

2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సూర్య – జ్యోతిక నిర్మిస్తున్న సినిమా ‘ఉడన్ పిరప్పు’ (Udanpirappe).. తెలుగులో ‘రక్తసంబంధం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నటుడు, దర్శకుడు శశి కుమార్ కథానాయకుడిగా, జ్యోతిక ఆయన సోదరిగా నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.

Vaishnav Tej : యాక్టర్‌గా ఫెయిల్ అయితే.. అప్పుడు ఆ పనులు చేసుకుంటా

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆర్.వేల్ రాజ్ విజువల్స్, డి.ఇమాన్ నేపథ్య సంగీతం బాగున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 14 నుంచి ‘ఉడన్ పిరప్పు’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.