Vaishnav Tej : యాక్టర్‌గా ఫెయిల్ అయితే.. అప్పుడు ఆ పనులు చేసుకుంటా

‘కొండపొలం’ మూవీ ప్రమోషన్స్‌లో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్..

Vaishnav Tej : యాక్టర్‌గా ఫెయిల్ అయితే.. అప్పుడు ఆ పనులు చేసుకుంటా

Vaishnav Tej

Vaishnav Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా ‘ఉప్పెన’ తో.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసాడు. బాక్సాఫీస్ బరిలో వంద కోట్లకు పైగా షేర్ సాధించిన (డెబ్యూ మూవీతో) ఫస్ట్ హీరోగా రేర్ ఫీట్ సాధించాడు.

Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!

ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమా చేసాడు. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. రకుల్ ప్రీత్ కథానాయిక. ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు వైష్ణవ్.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

తాను హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదని, సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్, ఎడిటర్ అవుదామనుకున్నాని అన్నాడు. ఇప్పుడు నా కెరీర్ బాగానే ఉంది.. అందుకే నా ప్రీవియస్ ప్లాన్స్ గురించి ఆలోచించట్లేదని.. ఒకవేళ నేను యాక్టర్‌గా ఫెయిల్ అయితే అప్పుడు మిగతా విభాగాల్లో టెక్నీషియన్‌గా ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.

Srivalli Song : ‘శ్రీవల్లి’ సాంగ్ వచ్చేస్తోంది..