Prabhas : ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్.. ‘సలార్’కి కూడా ఆ యంగ్ ఎడిటర్??

తాజాగా ఓ తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఉజ్వల్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఉజ్వల్ మాట్లాడుతూ.. ''నేను ఎడిట్ చేసిన కేజీఎఫ్‌ సినిమా ఫ్యాన్ మేడ్ విజువల్స్‌ని.............

Prabhas : ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్.. ‘సలార్’కి కూడా ఆ యంగ్ ఎడిటర్??

Salaar

 

Ujwal Kulkarni :  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ రెండు పార్టులు కూడా భారీ విజయం సాధించాయి. ‘కేజీఎఫ్‌ 2’ అయితే మరింత భారీ విజయం సాధించి ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది. దేశమంతటా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెర ముందు యశ్ హీరో అయినా తెర వెనకాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు చాలా మంది హీరోలు ఉన్నారు.

‘కేజీఎఫ్‌ 2’ సినిమాకి ఎడిటర్ గా ఓ 19 ఏళ్ల అబ్బాయిని ప్రశాంత్ నీల్ తీసుకోవడం విశేషం. ‘కేజీఎఫ్‌ 1’ సినిమాకి సంబంధించి కొన్ని ఫ్యాన్ మేడ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్ చేసిన ఉజ్వల్ కులకర్ణికి ఆ వీడియోలు చూసిన ప్రశాంత్ నీల్ పిలిచి మరీ నమ్మి ‘కేజీఎఫ్‌ 2’ సినిమాని చేతిలో పెట్టారు. చాలా మంది వద్దని వారించినా ఆ అబ్బాయిని నమ్మి ప్రశాంత్ నీల్ ఇంత పెద్ద సినిమా అతని చేతిలో పెట్టాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన వాళ్లంతా ఫిదా అయిపోయారు. ఆ కుర్రోడిని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉజ్వల్ సెలబ్రిటీ అయిపోయాడు.

KGF 2 : ‘కేజీఎఫ్‌’ ఆర్టిస్టుల పారితోషికం ఎంతో తెలుసా??

తాజాగా ఓ తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఉజ్వల్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఉజ్వల్ మాట్లాడుతూ.. ”నేను ఎడిట్ చేసిన కేజీఎఫ్‌ సినిమా ఫ్యాన్ మేడ్ విజువల్స్‌ని ప్రశాంత్‌ సార్‌ చూశారు. అవి ఆయనకి నచ్చడంతో నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత నాకు ‘కేజీఎఫ్‌ 2’కి ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రశాంత్ నీల్, యశ్ సర్ లతో కలిసి పని చేశానని ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. వాళ్లిద్దరూ నా ముందు కూర్చుంటే నేను వాళ్ల కోసం పని చేస్తున్నాను అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఇంత చిన్న వయసులో ఎడిటింగ్‌ నేర్చుకున్నావా? అని యశ్‌ సార్‌ అడిగి ఎంకరేజ్‌ చేశారు. ప్రశాంత్‌ సార్‌ ప్రతిదీ పక్కాగా ప్లాన్‌ చేస్తారు. సర్ చెప్పినట్టే నేను చేశాను. ఒకవైపు షూట్‌ జరుగుతుంటూనే మరోవైపు ఎడిట్‌ చేసేవాళ్ళం. ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్లు సమయం పట్టింది. సినిమాలో కొన్ని ఇంటర్‌ కట్స్‌ విషయంలో కాస్త కష్టం అనిపించినా అంతకుముందు పనిచేసిన ఎడిటర్ పక్కన ఉండి నేర్పించారు. ఈ సినిమాతో ఎడిటింగ్ పై మరింత గ్రిప్ వచ్చింది” అని తెలిపాడు.

Allu Arjun : ‘రాకీ భాయ్‌’ పై ‘పుష్ప’ స్పెషల్ ట్వీట్..

అలాగే ప్రభాస్ సలార్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ”సలార్‌ సినిమాకి వర్క్‌ చేయమని ప్రశాంత్‌ సార్‌ అడిగారు. నేను ఓకే చెప్పాను. అయితే నేను ఈ సినిమాకి సోలో ఎడిటర్‌గా చేస్తానా? లేదా ఇంకా ఎవరైనా వర్క్ చేస్తారా అనే విషయం నాకింకా తెలియదు” అని తెలిపాడు. మొత్తానికి సలార్ సినిమాకి కూడా ఈ కుర్రోడిని ఎడిటర్ గా పెట్టబోతున్నారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ మాస్ కటౌట్ తో తెరకెక్కుతున్న ఫుల్ యాక్షన్ మూవీ సలార్. మరి ఈ సినిమాకి కూడా ‘కేజీఎఫ్‌ 2’ ఎడిటర్‌ ఉజ్వల్ నే తీసుకుంటే ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా అదిరిపోతుంది అని ప్రేక్షకులు, సినీ వర్గాలు అంటున్నాయి. ‘కేజీఎఫ్‌ 2’ సినిమా చుసిన ప్రభాస్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు.