KGF 2 : ‘కేజీఎఫ్‌’ ఆర్టిస్టుల పారితోషికం ఎంతో తెలుసా??

'కేజీఎఫ్‌' సినిమాలో నటించిన ఆర్టిసులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? సాధారణంగా 'కేజీఎఫ్‌ 1' సినిమా వచ్చేదాకా కన్నడ సినీ పరిశ్రమ మిగిలిన వాటితో పోలిస్తే.....

KGF 2 : ‘కేజీఎఫ్‌’ ఆర్టిస్టుల పారితోషికం ఎంతో తెలుసా??

Kgf

KGF 2 :  యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు ముఖ్యపాత్రలుగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌ 2’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ ని ఊపేస్తోంది. ‘కేజీఎఫ్‌ 1’తోనే దేశమంతటా ప్రభంజనం సృష్టించి ‘కేజీఎఫ్‌ 2’ కోసం ఎదురుచూసేలా చేశారు చిత్ర యూనిట్. ఇక ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్ రోజు నుంచి కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది.

 

మరి ‘కేజీఎఫ్‌’ సినిమాలో నటించిన ఆర్టిసులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? సాధారణంగా ‘కేజీఎఫ్‌ 1’ సినిమా వచ్చేదాకా కన్నడ సినీ పరిశ్రమ మిగిలిన వాటితో పోలిస్తే చిన్న పరిశ్రమ. అక్కడ రెమ్యునరేషన్స్ కూడా తక్కువగానే ఉంటాయి. కానీ ‘కేజీఎఫ్‌ 1’ భారీ విజయం సాధించిన తర్వాత ‘కేజీఎఫ్‌ 2’కి బాగానే ఖర్చు పెట్టారు. కేవలం ‘కేజీఎఫ్‌ 2’లో కనిపించిన వారికి రెమ్యునరేషన్స్ బాగానే ఇచ్చారు. ‘కేజీఎఫ్‌ 1’ అధిక లాభాలు తీసుకురావడంతో హీరో, డైరెక్టర్ కి కూడా ‘కేజీఎఫ్‌ 2’కి డబ్బులు బాగానే ఇచ్చారని సమాచారం.

Raveena Tandon : నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని.. బన్నీపై ఆ హీరోయిన్ ట్వీట్

‘కేజీఎఫ్‌ 2’కి గాను రాకింగ్ స్టార్ యశ్‌ కు 25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఒకరకంగా వేరే ఇండస్ట్రీ స్టార్ హీరోలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఇక ‘కేజీఎఫ్‌ 2’లో అధీరాగా నటించిన సంజయ్‌ దత్‌కి 10 కోట్లు, రవీనా టండన్‌కి 2 కోట్లు, శ్రీనిధి శెట్టికి 3 కోట్లు, ప్రకాశ్‌ రాజ్‌కి 85 లక్షల వరకు రెమ్యునరేషన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇక కన్నడ సినీ పరిశ్రమ తలరాతని ఈ సినిమాతో మార్చేసిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌కి రెండు పార్టులకి కలిపి 20 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.