Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫొటోషూట్ లుక్ అదిరిందిగా..

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్

Mahesh

Updated On : November 26, 2021 / 2:30 PM IST

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి.. రోజులు మారుతున్నాయి నువ్వు మాత్రం ఏం మారలేదు మహేష్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ సూపర్ స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు.

Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’

మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫొటోషూట్ అప్పుడు తీసిన పిక్ ఇది. బ్లాక్ ట్రౌజర్, జాకెట్‌లో బైక్‌పై కూర్చుని ఉన్న మహేష్ లుక్ కిరాక్ ఉంది. జస్ట్ ఫొటోషూట్ కోసం తీసిన స్టిల్ ఈరేంజ్‌లో ఉందంటే ఇక సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తాడో ఊహించుకోవచ్చంటున్నారు ఫ్యాన్స్.

Mahesh Babu : పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. స్విమ్మింగ్‌ పూల్‌లో సితారతో మహేష్

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ ఎంటర్‌టైనర్.. ‘సర్కారు వారి పాట’ 2022 ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Mahesh Babu : మ్యాగజైన్ కోసం మహేష్ నమ్రత ఫోటోషూట్