Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ మారింది..

Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata

Updated On : November 3, 2021 / 4:27 PM IST

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ ఎంటర్‌టైనర్.. ‘సర్కారు వారి పాట’.. ఇటీవలే స్పెయిన్‌లో సాంగ్ షూట్ చేశారు.

Mahesh Babu : పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. స్విమ్మింగ్‌ పూల్‌లో సితారతో మహేష్

GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీని ముందుగా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చెయ్యబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు.

Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘భీమ్లా నాయక్’ ఇలా క్రేజీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ కూడా సంక్రాంతికే షెడ్యూల్ అవడంతో ‘సర్కారు వారి పాట’ టీం రిలీజ్ డేట్ మార్చక తప్పలేదు. 2022 ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన మహేష్ బాబు పోస్టర్ వైరల్ అవుతోంది.