Mahesh Babu : మ్యాగజైన్ కోసం మహేష్ నమ్రత ఫోటోషూట్

వీరిద్దరూ కలిసి ఆ సినిమా టైంలో ఫోటోషూట్ చేయించారు. కానీ తర్వాత అధికారికంగా వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయించలేదు. ఎక్కడికైనా కలిసి వెళ్తే అక్కడి మీడియా ప్రతినిధులు తీసిన ఫోటోలు తప్ప

Mahesh Babu : మ్యాగజైన్ కోసం మహేష్ నమ్రత ఫోటోషూట్

Mahesh (1)

Mahesh Babu :  సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తారు. మహేష్ తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయనప్పటికి నమ్రత మాత్రం తన ఫ్యామిలీ గురించి షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ నమ్రత ఎక్కువగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ సినిమాలో కలిసి నటించి అప్పుడే ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆ సినిమా టైంలో ఫోటోషూట్ చేయించారు. కానీ తర్వాత అధికారికంగా వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయించలేదు. ఎక్కడికైనా కలిసి వెళ్తే అక్కడి మీడియా ప్రతినిధులు తీసిన ఫోటోలు తప్ప ప్రత్యేకంగా ఫోటోషూట్ తీసుకోలేదు.

Tammareddy : పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

చాలా రోజుల తర్వాత మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారు. సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు కలిసి స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మహేష్ నమ్రతలు చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఈ ఫోటో చాలా బాగుండటంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.