Tammareddy : పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ వేడి ఇంకా చల్లారలేదు ఒక పక్క 'మా' ఎలక్షన్స్ లో కూడా ఈ టాపిక్ భాగమైంది. తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ

Tammareddy : పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy

Tammareddy :  ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ వేడి ఇంకా చల్లారలేదు. ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు కూడా పవన్ పై అటు వైసీపీ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ‘మా’ ఎలక్షన్స్ లో కూడా ఈ టాపిక్ భాగమైంది. తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.

ఇండస్ట్రీ సమస్యలపై ప్రభుత్వంతో ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లి మాట్లాడినా అది ఇండస్ట్రీకి సంబంధించి జరిపే చర్చలే అని తెలిపారు. అయితే ప్రభుత్వంతో ఎవరికైతే ఎక్కువ పరిచయాలు ఉంటాయో వాళ్ళే ఎక్కువ సంప్రదింపులు జరుపుతారు. గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎన్ఆర్ గారు మాట్లాడేవారు. ఆ తరువాత క్రిష్ణ గారు మాట్లాడేవారు. ఎన్టీఆర్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రిని కలవడం ఈజీ అయ్యింది. తర్వాత మళ్ళీ ఎవరూ సినీ పెద్దలతో ఎక్కువగా మాట్లాడలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అసలు ఇండస్ట్రీ వాళ్ళని కలవలేదు. తెలంగాణాలో తలసాని, కేటీఆర్ మాత్రమే మాట్లాడతారు. సీఎంతో మాట్లాడే ఛాన్స్ ఉండదు అని వ్యాఖ్యానించారు.

Balakrishna : బాలకృష్ణ కోసం నన్ను క్రూరంగా మార్చేశారు

జగన్ వచ్చిన తరువాత చిరంజీవి గారు వెళ్లి మాట్లాడారు. చిరంజీవి గారితో పాటు ఫిల్మ్ ఛాంబర్ వ్యక్తులు కూడా వెళ్లారు. అందరూ వెళ్లడం కుదరదు కాబట్టి కొంతమంది వెళ్తారు. వాళ్ళు వెళ్లారంటే ఇండస్ట్రీ మొత్తం వెళ్లినట్టే. ఏదో చిరంజీవి గారు ఒక్కరే మాట్లాడుతున్నారు అని పవన్ కళ్యాణ్ అనడం కరెక్ట్ కాదు అన్నారు. చిరంజీవి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన వెళ్లారు. నాకు అవకాశం వస్తే నేనూ వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఆయన చాలా పర్సనల్ గా తీసుకొని మాట్లాడారు. ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. ప్రభుత్వంతో ఇండస్ట్రీకి అవసరం కూడా. తిట్టుకుని కొట్టుకుంటేనో, ఇలా అరిస్తేనో పనులు జరగవు. అలాగని కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని తమ్మారెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.